SWARERO:ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో స్వేరో కు చోటు దక్కుతుందని ఊహించలేదు!!

SWARERO పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటు దక్కడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన ట్వీట్ చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞాన ఖడ్గంతో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకమన్నారు.

New Update
SWARERO:ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో స్వేరో కు చోటు దక్కుతుందని ఊహించలేదు!!

SWARERO: SWARERO పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటు దక్కడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన ట్వీట్ చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞాన ఖడ్గంతో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మనిషి ఆలోచనాసరళిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని ఈ గుర్తింపుతో నిరూపితమైందన్నారు ఆర్ఎస్పీ.

ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో స్వేరో చోటు దక్కించుకుంటుందని తాను ఎప్పుడూ ఊహించలేదని.. ప్రస్తుతం ఈ పదం నామవాచకంగా ఉందన్నారు. భవిష్యత్తులో అది క్రియగా మారుతుందన్నారు. అయితే దీని క్రెడిట్ అంతా దేశవ్యాప్తంగా సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు వారి తల్లిదండ్రులకు, టీచర్లకు, పూర్వ విద్యార్థులకు దక్కుతుందన్నారు ఆయన.

అసలు స్వేరోస్ అంటే..

అక్షరం అనే ఆయుధంతో ఆకాశమే హద్దుగా సాగిపోవడమే స్వేరోస్. కులం, మతం, వర్గం లాంటి అడ్డుగోడలకు ఏమాత్రం తావులేకుండా, చుట్టూ ముళ్ల కంపలా ఉన్న అన్నీ ప్రతిబంధకాలను చేధించుకుంటూ ఆకాశమే హద్దుగా సాగిపోవడమే స్వేరోయిజం. ఇక ఏ సమాజం నుంచి నువ్వు వచ్చావో, ఏ సమాజమైతే నీ ఉన్నతికీ, ఎదుగుదలకు కారణం అయిందో.. ఆ సమాజం రుణం తీర్చుకోవడానికి పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని అనుక్షణం గుర్తుకు చేసేదే స్వేరో. తోటి సమాజాన్ని తనతో పాటు ముందుకు నడిపించడమే స్వేరోయిజం.

Advertisment
Advertisment
తాజా కథనాలు