మీ మొబైల్ పోయిందా..చింతించకండి..ఇలా చేసి తిరిగి పొందండి!

భారతీయ టెలికాం విభాగం సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ (సీఐఈఆర్‌)ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌ పోయినా, దొంగతనానికి గురైనా వెబ్‌లింక్‌ ద్వారా దానిని నేరుగా బ్లాక్‌ చేయొచ్చు. ఫోన్‌ను ట్రాక్‌ చేయొచ్చు.అది ఎలా ఇప్పుడు చూద్దాం.

New Update
మీ మొబైల్ పోయిందా..చింతించకండి..ఇలా చేసి తిరిగి పొందండి!

భారతీయ టెలికాం విభాగం సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ (సీఐఈఆర్‌)ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌ పోయినా, దొంగతనానికి గురైనా https://ceir.gov.in వెబ్‌లింక్‌ ద్వారా దానిని నేరుగా బ్లాక్‌ చేయొచ్చు. ఫోన్‌ను ట్రాక్‌ చేయొచ్చు. సీఐఈఆర్‌ సేవలు భారతదేశం అంతటా అందుబాటులో ఉన్నాయి. సంచార్‌సాథి పోర్టల్‌ (https://ceir.sancharsaathi.gov.in/Home/index.jsp) ద్వారా కూడా సీఐఈఆర్‌ పోర్టల్‌ను యాక్సెస్‌ చేయొచ్చు. ఐఎమ్‌ఈఐ నంబర్‌ ద్వారా మొబైల్‌ను ట్రాక్‌ చేయొచ్చు. సీఐఈఆర్‌ ద్వారా మొబైల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేస్తే.. దొంగతనానికి గురైన హ్యాండ్‌సెట్‌కు ఏ మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ అందవు. అందులో ఉన్న ఫైల్స్‌ను యాక్సెస్‌ చేయడం కూడా కుదరకుండా హ్యాండ్‌సెట్‌ను బ్లాక్‌ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే.. ఒక డెడ్‌ఫోన్‌లా మారిపోతుందన్నమాట!

హ్యాండ్‌సెట్‌ మిస్సయినట్లయితే పోలీసులను వెంటనే సంప్రదించాలి. ఎఫ్‌ఐఆర్‌, లాస్ట్‌ మొబైల్‌ సర్టిఫికేట్‌ చెక్‌ చేసి పోలీసులు నంబర్‌ను బ్లాక్‌ చేస్తారు. అప్పుడు దొంగతనానికి గురైన ఫోన్‌ను ఎవరు వినియోగిస్తున్నారో పోలీసులు (లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ) తెలుసుకోగలుగుతారు. సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించి.. ఆ మొబైల్‌ను వినియోగిస్తున్న వ్యక్తి వివరాలను తెలుసుకుంటారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఫోన్‌ను అసలు యజమానికి అందజేస్తారు.

ఫోన్‌ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా ‘మీ సేవ’ నుంచి లాస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ సర్టిఫికేట్‌ గానీ, పిటిషన్‌ రసీదు కాపీ ద్వారా గానీ డూప్లికేట్‌ సిమ్‌ పొందొచ్చు.

సీఐఈఆర్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత.. పిటిషన్‌ రసీదు, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, ఆధార్‌/ ఓటర్‌ ఐడీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత రిఫరెన్స్‌ ఐడీ వస్తుంది.

మీ మొబైల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయమని కోరండి. అప్పుడు మీ రిజిస్టర్డ్‌ ఫోన్‌నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేస్తే.. నంబర్‌ బ్లాక్‌ అవుతుంది.

మీ హ్యాండ్‌సెట్‌ రికవరీ అయిన తర్వాత.. అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ను అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు

Advertisment
Advertisment
తాజా కథనాలు