Summer: వేడి చేసిందా..అయితే ఇలా తగ్గించుకోండి! అసలే ఎండకాలం సూర్యుడు కనీసం కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ ఎండలతో విరుచుకుపడుతున్నాడు.దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన పదార్ధాలు ఎంటో తెలుసుకుందాం. By Durga Rao 20 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఈ కాలంలో ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోటిలో పుండ్లు పడటం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమట, మల, మూత్రనాళాల్లో మంట, అరికాళ్లు, అరిచేతుల్లో మంట, ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అసలే ఎండకాలం సూర్యుడు కనీసం కనికరం లేకుండా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ ఎండలతో విరుచుకుపడుతున్నాడు. దీనివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఒంట్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, నోటిలో పుండ్లు పడటం, మలబద్ధకం, జ్వరం రావడం, చిరాకు, అధిక చెమట, మల, మూత్రనాళాల్లో మంట, అరికాళ్లు, అరిచేతుల్లో మంట, ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన పదార్ధాలు ఎంటో తెలుసుకుందాం.. గోరువెచ్చని పాలలో కాస్తంత తేనె కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. పాలలో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం వుంటుంది. ఉదయాన్నే గ్లాసుడు నిమ్మరసం తాగితే... ఒంట్లో వేడి తగ్గుతుంది. ఉప్పు, లేదా పంచదార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు. పుచ్చకాయ తింటే శరీరంలో వున్న వేడి తగ్గిపోతుంది. రోజూ రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగినా ఫలితం వుంటుంది. అసలు మంచి నీళ్లు బాగా తాగితే శరీరంలో వేడి తగ్గిపోయి సమ ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజలు వేడి నీళ్ళలో కాచి, మజ్జిగ వేసుకుని పలచగా తాగితే వేడి తగ్గుతుంది. అలోవెరా జ్యూస్ తాగితే చలవ చేస్తుంది అలాగే దాని ఆకుల మధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది. గంధం చల్లని నీరు, లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం. ఇవన్నీ తీసుకున్నకూడా వేడి చేసే శరీరతత్వం ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా టీ, కాఫీలు అధికంగా తాగరాదు, ఆయిల్ ఫుడ్స్, పచ్చళ్లు, చింతపండు, వెల్లుల్లి, అల్లం, వేడి చేసే పండ్లు అనగా బొప్పాయి, జంక్ ఫుడ్స్, చికెన్, ఆమ్లెట్ వంటి వాటికి సాధ్యమైనంత మేర దూరంగా ఉండాలి. #summer-foods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి