ఇళయరాజా బయోపిక్.. హీరోగా ధనుష్

New Update
ఇళయరాజా బయోపిక్.. హీరోగా ధనుష్

Dhanush in Ilayaraja Biopic : ఇళయరాజా సినీసంగీత ప్రపంచంలో రారాజు. తరాలు మారినా ఆయన సంగీతం ఇప్పటికీ ఎప్పటికీ వన్నె తగ్గదు. ఎంతో మంది కొత్త సంగీత దర్శకులు సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికీ ఇళయరాజా మ్యూజిక్ ఒక బ్రాండ్. ఆయన మార్కుని, ఆయన అందించిన మెలోడీలని మరొకరు అందించలేరు.

ఐదు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో ఆబాల గోపాలాన్ని అలరిస్తూ తనదైన మార్కు సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ఇళయరాజా. అంతటి సంగీత స్వరకర్త, ఇసయజ్ఞాని ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రావాలని, ఎవరైనా చేస్తే చూడాలని చాలా మంది ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇళయరాజా బయోపిక్ ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే దక్షిణాది దర్శకుడు కాకుండా ఉత్తరాదికి చెందిన బాలీవుడ్ డైరెక్టర్ బాల్కీ ఈ బయోపిక్ ఆలోచనను తీసుకురావడం విశేషం. బాలీవుడ్ లో ప్రత్యేకమైన సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్.ఆర్. బాల్కీ, త్వరలో ఇళయరాజా జీవితం ఆధారంగా భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.

హీరో ధనుష్ తో మంచి అనుబంధం ఉన్న ఈ దర్శకుడు ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ (Dhanush in Ilayaraja Biopic)ను మెయిన్ లీడ్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆయన వెల్లడించారు కూడా. ధనుష్ కూడా ఈ బయోపిక్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడని కోలీవుడ్ టాక్.

ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ లో నటిస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనితో పాటు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ఓ భారీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ధనుష్ 50వ సినిమా. ఈ సినిమా తర్వాత ఇళయరాజా బయోపిక్ పై క్లారిటీ వస్తుంది.

Also Read: రజనీకాంత్ సినిమాలో నాని?

Advertisment
Advertisment
తాజా కథనాలు