Devara Movie: ఎన్టీఆర్ కు అక్కగా మంచు లక్ష్మి?

జూనియర్ NTR దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'దేవర'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జానియర్ NTR నటిస్తున్న 'దేవర'లో మంచు లక్ష్మి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. మంచు లక్ష్మి NTR అక్కగా కనిపించనున్నట్లు సమాచారం.

New Update
Devara Movie: ఎన్టీఆర్ కు అక్కగా మంచు లక్ష్మి?

 Devara Movie: RRR సినిమా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ NTR.. కొరటాల శివ దర్శకత్వంలో  'దేవర' సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో కొరటాల శివ, NTR కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' జూనియర్ NTR కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రెండో సారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'దేవర' సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు చాలా బిజీగా గ్యాప్ లేకుండా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి  గోవాలో ప్లాన్ చేసిన షెడ్యూల్లో ప్రముఖ నటీనటులు పాల్గొనబోతున్నారు.

కొరటాల.. దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. NTR అభిమానులు కూడా ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రతీ అప్డేట్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మూవీ టీం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

publive-image

జానియర్ NTR నటిస్తున్న 'దేవర'లో మంచు లక్ష్మి కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. మంచు లక్ష్మీ NTR అక్కగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే  మంచు లక్ష్మి పాత్రలో నెగటివ్ షేడ్స్  కూడా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. రీసెంట్ గా తనకు సంబంధించిన షెడ్యూల్లో కూడా ఆమె పాల్గొనట్లుగా సమాచారం. కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇప్పటికే దేవర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం జూనియర్ NTR కూడా ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు.

publive-image

అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయనున్నట్లు ఇప్పటికే క్లారీటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. షూటింగ్ విషయంలో ఆలస్యం లేకుండా అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయాలనీ దర్శకుడు కొరటాల సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

Also Read: Balakrishna Next Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి తెలిస్తే పూనకాలే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment