CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన కోర్టు లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. By V.J Reddy 27 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్, రిమాండ్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదికి వాయిదా వేసింది. Delhi High Court issues notice to Enforcement Directorate on plea moved by CM Arvind Kejriwal raising issues of legality and validity regarding the arrest and remand. Delhi HC seeks ED's response on the main petition as well as the application for interim release of the… pic.twitter.com/5eRoyAVwk4 — ANI (@ANI) March 27, 2024 ALSO READ: ఆసుపత్రి నుంచి సద్గురు జగ్గీ వాసుదేవ్ డిశ్చార్జ్ విషమంగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన షుగర్ లెవల్స్ సడెన్‌గా డ్రాప్ అయిపోయాయి. దీనిని గమనించిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం షుగర్ లెవల్స్ 46కు పడిపోయాయని, కేజ్రీవాల్ ను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నిజాలు బయటపెడతారు.. ఇక లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఆయన సతీమణి సునీత (Sunita Kejriwal) బుధవారం సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త కేజ్రివాల్ మార్చి 28న కోర్టులో బయటపెడతారని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు.. ‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’ అంటూ సునీత ఆందోళన చెందారు. ఇక మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపినా ఈడీకి ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు. #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి