CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఇటీవల ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా.. సీబీఐ కేసులో ఆయన జైలులోనే ఉన్నారు.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ (CBI) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల దీనిపై విచారణ చేప్పట్టిన ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఇటీవల ఈడీ కేసులో (ED Case) సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా.. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు. కాగా ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పుపై ఆప్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈడీ కేసులో మధ్యంతర బెయిల్..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చినా.. సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.

సీఎం కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని సుప్రీం పేర్కొంది. అతను దాదాపు 90 రోజులు జైలు శిక్ష అనుభవించారని చెప్పింది. ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 17న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ కు ఉరటనిస్తూ మధ్యంతరం బెయిల్ ను మంజూరు చేసింది. కాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు తిరిగి తమ వద్దకు వస్తున్నారని సంబరాలు జరుపుకుంటున్నారు.

Also Read: మన దేశ బడ్జెట్ ఎలా సిద్ధం చేస్తారో తెలుసా? ఆర్ధిక మంత్రి అన్ని నిర్ణయాలూ తీసుకుంటారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు