CM Kejriwal: మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్.. ఈసారైనా బెయిల్ వచ్చేనా? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌తో పాటు వారం రోజుల మధ్యంతర బెయిల్ కోరారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది కోర్టు. దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. By V.J Reddy 30 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ తో పాటు వారం రోజుల మధ్యంతర బెయిల్ కోరారు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది కోర్టు. దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. Excise policy case | Delhi Court issues to Enforcement Directorate on Arvind Kejriwal's interim and regular bail petitions in Excise policy money laundering case. The next hearing is on June 1. — ANI (@ANI) May 30, 2024 ఇటీవల సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. కాగా బెయిల్ పొడిగింపు కోసం దిగువ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కేజ్రీవాల్ తరఫున లాయర్లకు సూచించింది. మధ్యంతర బెయిల్ మరోవారం పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. #cm-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి