భారీ బాంబు పేలుడు.. 39 మంది మృతి...!

పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. వాయవ్య పాకిస్తాన్ లో జమైత్ ఉలేమా ఇ ఇస్లాం ఎఫ్(జేయూఐ-ఎఫ్) సమావేశంలో బాంబు పేలడంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో 39 మంది మరణించారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

New Update

అప్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖార్ అనే ప్రాంతంలో జేయూఐ-ఎఫ్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 500 మంది వరకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా బాంబు పేలింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జేయూఐ-ఎఫ్ సమావేశాన్ని టార్గెట్ చేసుకుని ఈ పేలుళ్లు జరిగాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆస్పత్రిలో 39 మృత దేహాలు వున్నట్టు కైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ ఆరోగ్య శాఖ మంత్రి రియాజ్ అన్వర్ వెల్లడించారు. 123 మంది గాయాలయ్యాయని పేర్కొన్నారు. మరో 17 మంది పరిస్థితి విషమంగా వుందన్నారు. వారినీ మెరుగైన వైద్య సేవల కోసం పెషావర్ ఆస్పత్రికి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్టు వివరించారు.

ఇది ఆత్మాహుతి దాడి అని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) హస్తం వున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా వుంటే ఇటీవల జేయూఐ-ఎఫ్ నేతలపై ఇటీవల స్థానిక ఐస్ఐస్ ఉగ్రవాదులు దాడులు చేశారు. దీంతో దాడుల వెనుక ఏదైనా హస్తం వుందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు