వామ్మో.. ఇంటి అద్దె కరెంట్ బిల్లు రూ. 43 వేలా.!

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా రూ. 43 వేలు వచ్చింది. అద్దె ఇంటి కరెంట్ బిల్లును చూసి బాధిత మహిళ లబోదిబోమంటోంది. దీనిపై అధికారులను అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతోంది.

New Update
వామ్మో.. ఇంటి అద్దె  కరెంట్ బిల్లు రూ. 43 వేలా.!

Power Bill Shock: శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని విజయనగరం కాలనీ వాసులకు విద్యుత్ అధికారులు వేల రూపాయల కరెంటు బిల్ ఇచ్చి వినియోగదారులకు షాక్ ఇస్తున్నారు. సరోజమ్మ అనే మహిళ విజయనగర కాలనీలో నివాసం ఉంటుంది. అయితే, తను ఉండే ఓ సాధారణ ఇంటికి రూ. 43 వేల కరెంటు బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అద్దె ఇంటిలో ఉంటున్న తనకు ఏకంగా 43 వేల కరెంట్ బిల్లు రావడంతో లబోదిబోమంటూ కార్యాలయానికి పరుగులు తీసింది.

అక్కడ అధికారులు కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్ధితిలో కనిపిస్తోంది. మణీ అనే మహిళ మాట్లాడుతూ.. ఇంటి అద్దె రూ. 3000 చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని, గత రెండు మూడు నెలలుగా రూ. 30 వేలు, 40 వేల కరెంటు బిల్లు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేమని అడిగితే అధికారులు కూడా పట్టించుకోవడం లేదని బాధిత మహిళ వాపోతోంది.

Also read: యువగళం పాదయాత్ర కాదు.. బ్రేకుల యాత్ర..హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

మూడు సంవత్సరాలు ఇదే ఇంట్లోనే ఉంటున్నామని కేవలం ఫ్యాను, బల్బు, టీవీ మాత్రమే ఉన్నాయని తెలిపింది. అయితే, గతంలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేదని కానీ, గత మూడు నెలలులో ఒక నెల రూ.3 వేలు, మరో నెల రూ. 9 వేలు వచ్చిందని వాపోయింది. ఈ నెల మాత్రం ఏకంగా రూ. 43 వేల 516 రూపాయల బిల్లు వచ్చందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంత పెద్ద మొత్తం తాను ఎలాగ కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యుత్ బిల్లు అయినా తగ్గించండి.. లేదా కరెంట్ కనెక్షన్ అయినా తొలగించండి.. లాంతరు పెట్టుకొని అయినా జీవనం సాగిస్తాం అని కన్నిటి పర్యంతం అవుతుంది. అంత బిల్లు కట్టలేమని  ఆవేదన వ్యక్తం చేస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేదలమని వేలాది రూపాయలు బిల్లులు వస్తే ఎలా చెల్లించాలని బాధపడుతోంది. అంత బిల్లు చెల్లించలేనని.. ఆత్మహత్య శరణ్యమని అంటోంది. విద్యుత్ అధికారులు మాత్రం మీటర్ మార్చి చూస్తామని అంటున్నారంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్‌ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

New Update
Fire Accident in pawan son school

Fire Accident in pawan son school

Advertisment
Advertisment
Advertisment