CPI Narayana: జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. నారాయణ సంచలన వ్యాఖ్యలు..! ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సాక్షాత్తు ప్రధాని మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 16 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి CPI Narayana: సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ల్యాండ్, వైన్, శ్యాండ్ ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే జగన్ అవినీతిపై మాట్లాడారన్నారు. జగన్ అవినీతి, అక్రమాలపై మాట్లాడిన మోడీ వెంటనే జగన్ ను అరెస్టు చేయించాలని కోరారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నాడని ఎద్దేవా చేశారు. ఓటమి భయం.. రాష్ట్రంలో వైసీపీ నేతలు విధ్యంసాలకు తెరలేపుతున్నారని మండిపడుతున్నారు. రాజకీయ విధానాలనే జనం నమ్ముతారని..నిత్యం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పోలింగ్ కాక ముందు జగన్ ఇంటర్వ్యూ చూశానని..ఓటమి భయం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. పోలింగ్ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రెస్ మీట్ లో కూడా అధికారం కోల్పోతున్నామన్న ఆవేదన కనిపించిందన్నారు. కీలు బొమ్మగా.. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నరేంద్రమోడీ చేతిలో కేంద్రం ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందన్నారు. మోడీ పాలనలో నల్లధనం పెరిగింది..దేశ ఆస్తులను అదానీకి మోడీ అప్పచెబుతున్నాడన్నారు. మోడీ హయాంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టి 29 మంది విదేశాలకు పారిపోయారని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సరఫరా మొత్తం అదానీ పోర్ట్ నుంచే అక్రమంగా సాగుతోందని ఆరోపించారు. #cpi-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి