బీజేపీ ముసుగులో కేసీఆర్.. మద్యం అమ్మేవాళ్లు టీటీడీ బోర్డు మెంబరా? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ ఫైర్

ఢిల్లీ నుంచి కేసీఆర్ కు మొట్టి కాయలు పడ్డాయని, అందుకే బీజేపీకి అనుకూలంగా మారాడని ఆరోపించారు సీపీఐ నారాయణ. కేసీఆర్ బీజేపీ ముసుగులో ఉన్నాడని, మోదీ ఏం చెబితే అదే చేస్తున్నాడని విమర్శించారు. తిరుపతి దేవస్థానం పరిసరాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం ఉంటే మద్యం అమ్మేవాళ్ల నే టీటీడీ బోర్డు సభ్యునిగా ఎంపిక చేశారని జగన్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మోదీ గ్రాఫ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ అంత వేగంగా పతనమవుతోందన్నారు. ఢిల్లీలో నారాయణ చేసిన వ్యాఖ్యలు మీడియాలో కలకలం రేపుతున్నాయి.

New Update
బీజేపీ ముసుగులో కేసీఆర్.. మద్యం అమ్మేవాళ్లు టీటీడీ బోర్డు మెంబరా? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ  ఫైర్

ప్రధాని మోదీ (PRIME MINISTER MODI) చంద్రయాన్ ని కూడా ఒక మతానికి ముడి పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు సీపీఐ నారాయణ. చంద్రయన్ 3 (CHANDRAYAN 3)లాంచ్ అయిన ప్రాంతానికి శివశక్తి (SIVASAKTI)అని పేరు పెట్టటాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రయాన్ విజయవంతం కావటంతో, విదేశాల్లో మోడీ గ్రాఫ్ పెరుగుతోందని, భారతదేశంలో మాత్రం వందే భారత్ ట్రైన్ మాదిరిగా వేగంగా పతనమవుతోందని వ్యాఖ్యానించారు.

మణిపూర్ భగ్గుమంటున్నా చలించటం లేదు 

మోదీ ఎక్కడెక్కడికో పర్యటనకు వెళ్తున్నారు కానీ మణిపూర్ (MANIPUR)   వెళ్లడం లేదని  నారాయణ విమర్శించారు. డి. రాజా ఆధ్వర్యంలో తాము మణిపూర్ లో పర్యటించాం అని, తిరిగొచ్చిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితిని వివరించామని చెప్పారు.

మణిపూర్ లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని తెలిపారు నారాయణ. కుకీస్, మైటీస్, నాగాస్ ఎవరి ప్రాంతాల్లో వాళ్లే ఉండే విధంగా బార్కెడ్లు ఏర్పాటు చేశారు. మణిపూర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు. ముఖ్యమంత్రి ని తొలగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

గ్యాస్ సిలిండర్ తగ్గింపు ఎన్నికల స్టంటే 

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గించినట్లు ప్రకటించటం ఎన్నికల వ్యూహమేనని నారాయణ విమర్శించారు.
''కాంగ్రెస్ పార్టీ గ్యాస్ ధర ను 20 రూపాయలుపెంచితే, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే 2014లో మోడీ ప్రధాని అయ్యేటప్పటికీ ఎంత రేటు ఉందో ఇప్పుడు అదే రేటు ఉంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఒప్పుకుంటాం" అన్నారు.

బీజేపీ ముసుగులో కేసీఆర్, జగన్

కేసీఆర్ బీజేపీ ముసుగులో ఉన్నాడని, మోదీ ఏం చెబితే అదే చేస్తున్నాడు. ఏపీలో వైసీపీది అదే పరిస్థితి అని  ధ్వజమెత్తారు నారాయణ.  విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగడం లేదు. ప్రధానమంత్రి హోదాలో అమరావతిలో పునాది రాయి వేశారు దానికి అన్యాయం జరుగుతుంటే మోదీ ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ కి బిజెపి అన్ని రకాలుగా అన్యాయం చేసింది. టీడీపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా  బిజెపికి సహాయం చేయకూడదని అన్నారు.

ఆయన ఏమన్నారంటే..

➼ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాల్సి ఉంది. జగన్ అమిత్ షా ను కలిసి అవినాష్ రెడ్డి బెయిల్ పొడిగించాలని కోరాడు.

➼ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. కవితను అరెస్ట్ చేయాల్సి ఉంది.  కానీ కేసీఆర్ 

 కేంద్ర ప్రభుత్వ పెద్దల ను కలిశారు. కవిత అరెస్టు నిలిచిపోయింది.

➼ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్ర రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఎన్నుకున్నారు.

➼ తిరుపతి దేవస్థానం పరిసరాల్లో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం .  మద్యం అమ్మేవాళ్ల నే టిటిడి మెంబర్ గా ఎన్నుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?

➼ ఎన్వీరమణ తర్వాత న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది.

➼ విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడగడం లేదు.

➼ ప్రధానమంత్రి హోదాలో అమరావతిలో పునాది రాయి వేశారు దానికి అన్యాయం జరుగుతుంటే మోదీ ఎందుకు స్పందించడం లేదు.

➼ ఎన్వీరమణ తర్వాత న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం పోయింది

➼ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి ఫ్రంట్ గా ఏర్పడితే బిజెపి గ్రాఫ్  వేగంగా తగ్గిపోతుంది. 

➼ కాంగ్రెస్,సీపీఐల కలయిక అనేది నిశ్చితార్థం దశలో ఉంది.

➼ ఇండియా కూటమి 26 పార్టీల సమావేశానికి సీపీఐ తరపున డీరాజా హాజరవుతారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీలో రాజ్యసభ ఎన్నిక.. చంద్రబాబు, అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం.. అభ్యర్థి ఎవరంటే?

ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగనుంది. ఈ రోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ మీజీ చీఫ్ అన్నామలై, స్మృతీ ఇరానీలో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.

New Update
Andhra Pradesh Rajyasabha Election

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ సీటు కూటమికే దక్కే ఛాన్స్ ఉంది. దీంతో కూటమి నుంచి ఈ సీటు కోసం ఎవరు బరిలో ఉంటారు అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ పోటీ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

టీడీపీ ఓకే..

అయితే.. బీజేపీకి ఈ సీటును ఇచ్చేందుకు కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన సైతం అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నామలై, మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీలో ఒకరిని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. 

telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment