కరోనా పంజా.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. జనంలో టెన్షన్

కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో ఎనిమిది కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

New Update
కరోనా పంజా.. తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. జనంలో టెన్షన్

Covid Cases in Telangana: కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. క్రమంగా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. మహమ్మారి పంజా విసురుతూ కేసులు విస్తరిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో ఎనిమిది కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: జీతాల పెంపు సాధ్యం కాదు.. అంగన్వాడీలతో చర్చలు విఫలం

వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. అయితే, తాజాగా నలుగురు కోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 8,40,396కు పెరిగింది. ప్రస్తుతం 59మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 30 మంది టెస్టులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు