Hindenburg Report: హిండెన్‌బర్గ్ వివాదం.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు 

హిండెన్‌బర్గ్-సెబీ చీఫ్ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. ఈనెల 22న దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

New Update
Hindenburg Report: హిండెన్‌బర్గ్ వివాదం.. దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు 

Hindenburg Report: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ఆగస్టు 22న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన హిండెన్‌బర్గ్ రిపోర్ట్.. అలాగే అదానీ, సెబీలకు సంబంధించిన స్కామ్‌లపై చర్చించాం’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌ చెప్పారు. 

Hindenburg Report: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) చీఫ్ మాధబి పూరీ బుచ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యాలయాల వెలుపల దేశవ్యాప్త నిరసనను చేపట్టనున్నట్లు కాంగ్రెస్ మంగళవారం తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదికలో ఆమెకు వ్యతిరేకంగా. కాగా, అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ఢిల్లీలో పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర శాఖాధిపతులు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు.  

Hindenburg Report: ఈ సమావేశంలో కుల గణన, వాయనాడ్ కొండచరియలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్‌  ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలపై చర్చించారు."బంగ్లాదేశ్ సమస్యకు సంబంధించి, మతపరమైన మైనారిటీలు - వారి ప్రార్థనా స్థలాలపై లక్షిత దాడులను ఆపడానికి అలాగే వారు భద్రత, గౌరవం,  సామరస్యంతో జీవించడానికి వీలు కల్పించడానికి అన్ని చర్యలను తీసుకోవాలని భారతప్రభుత్వాన్ని సమావేశం కోరింది" అని AICC ప్రధాన కార్యదర్శి అన్నారు. 

Hindenburg Report: అదానీ మనీ స్కామ్‌లో ఉపయోగించిన ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ వాటాలు ఉన్నాయని ఆగస్టు 10న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపించింది.

బుచ్, ఆమె భర్త ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చారు.  హిండెన్‌బర్గ్ రీసెర్చ్ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ విశ్వసనీయతపై దాడి చేసిందని..  "భారత్ లో ఉల్లంఘనలకు" షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి బదులుగా దాని సెబీ చీఫ్‌పై ఆరోపణలతో వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తోందని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు