Telangana Elections: ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రాహుల్ గాంధీ. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయని, కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాయన్నారు రాహుల్. 'తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం' అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్. By Shiva.K 20 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rahul Gandhi Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో (Jagtial) పర్యటిస్తున్న ఆయన.. కేసీఆర్(CM KCR) పాలనపై విమర్శలు గుప్పించారు. ఇది దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామన్నారు. అలాగే, క్వింటా పసుపు పంటకు రూ.12వేలు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధం అని పేర్కొన్నారు. ఈ అనుబంధం ఈనాటిది కాదని, నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందన్నారు. బీజేపీ (BJP), బీఆరెస్, ఎంఐఎం (MIM) ఈ మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు రాహుల్ గాంధీ. వీరిమధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, బీఆరెస్.. రాష్ట్రంలో బీజేపీకి బీఆరెస్, ఎంఐఎం సహకరించుకుంటున్నాయన్నారు. తాను బీజేపీపై పోరాటం చేస్తుంటే.. తనపై కేసులు పెట్టారని ఆరోపించారు రాహుల్. తన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని, తనను ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. తన ఇల్లు భారత ప్రజలు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందన్నారు. తనను తన ఇంటి నుంచి బయటకు పంపించగలరేమో కానీ.. ప్రజల హృదయాల్లోంచి కాదని చెప్పారు. ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. కుల గణనకు ఆ ఇద్దరూ వ్యతిరేకమే.. కులగణన (Caste census) పై పాట్లమెంటులో డిమాండ్ చేశానని చెప్పారు రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో తాను వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కులగణనకు ముందుకు రావడం లేదన్నారు. కులగణన అటు మోడీకి.. ఇటు కేసీఆర్ కు ఇష్టంలేదని ఆరోపించారు రాహుల్. దేశ బడ్జెట్ కేటాయింపులో ఐఏఎస్ లది కీలక పాత్ర అన్న ఆయన.. అలాంటి అధికారుల్లో 90శాతం అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కారణంగానే కులగణన చేస్తేనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే.. ఇక్కడ కూడా బీసీ కులగణన చేపడతామన్నారు. కులగణన ఎక్స్ రే లాంటిదని, కులగణన జరిగితేనే బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ (Congress) కట్టుబడి ఉందన్నారు రాహుల్ గాంధీ. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయని, కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాయన్నారు రాహుల్. 'తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం' అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్. ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్.. #telangana-election-2023 #rahul-gandhi-in-telangana #rahul-gandhi-campaign మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి