Telangana Congress: కాంగ్రెస్ తొలి జాబితా బిడుదల.. లిస్ట్‌లో ప్రత్యేకతలు.. ఇతర నేతల రియాక్షన్స్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ అయ్యింది. మెుత్తం 55 మందితో ఏఐసీసీ అధిష్టానం ఆదివారం ఈ జాబితా విడుదల చేసింది. వివాదాలకు తావు లేని స్థానాలనే తొలుత ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్‌కు అభ్యర్దిని ఖరారు చేసిన కాంగ్రెస్, కామారెడ్డి టికెట్‌ను మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. అదే సమయంలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుండగా, రేవంత్ టీంకు సీట్లు దక్కాయని పలువురు భావిస్తున్నారు.

New Update
Telangana: కాంగ్రెస్‌ ఫైనల్‌ లిస్ట్‌? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్‌!

(తొలివెలుగు, హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ అయ్యింది. మెుత్తం 55 మందితో ఏఐసీసీ అధిష్టానం ఆదివారం ఈ జాబితా విడుదల చేసింది. వివాదాలకు తావు లేని స్థానాలనే తొలుత ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్‌కు అభ్యర్దిని ఖరారు చేసిన కాంగ్రెస్, కామారెడ్డి టికెట్‌ను మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. అదే సమయంలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుండగా, రేవంత్ టీంకు సీట్లు దక్కాయని పలువురు భావిస్తున్నారు. ఇక పార్టీ ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. భట్టి విక్కమార్క మధిర నుంచి, సీతక్క ములుగు నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. జానారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నట్లు స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ కన్ఫార్మ్ ఆయింది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన సతీమణికి కూడా టికెట్ దక్కింది. ఉత్తమ్ హుజుర్‌నగర్, పద్మావతి కోదాడ నుంచి బరిలోకి దిగుతున్నారు. భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక వామపక్షాలతో పొత్తులో భాగంగా చెన్నూరు, కొత్తగూడెం సీట్లు సీపీఐకి ఖరారు చేశారు.

ఫస్ట్ లిస్ట్‌లో పేరు లేని పలువురు సీనియర్లు, కీలక నేతలు..

* సూర్యాపేట - మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డికి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్న ఈ సీటును ఫస్ట్‌ లిస్ట్‌లో ప్రకటించలేదు. కాగా పటేల్ రమేశ్‌ రెడ్డికే టికెట్‌ ఖాయమైనట్లు తెలుస్తోంది.
* సత్తుపల్లి - ఈ టికెట్ కోసం మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే టికెట్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేత మానవతారాయ్ కూడా పోటీలో ఉన్నారు. ఈ టికెట్‌ను కూడా ప్రస్తుతానికి ప్రకటించలేదు.
* కామారెడ్డి - ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున షబ్బీర్ అలీ పోటీ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీటును కూడా ఫస్ట్ లిస్ట్‌ లో ప్రకటించలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది షబ్బీల్ అలీ ఒక్కరే కావడంతో తనకే టికెట్ వస్తుందని ఆయన భావిస్తున్నారు.
* ఎల్బీనగర్ - మధుయాష్కీ గౌడ్ పోటీ ఖాయమని ప్రచారం జరగ్గా.. ఫస్ట్‌ లిస్ట్‌లో ఈ టికెట్ ప్రకటించలేదు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ గౌడ్ కు టికెట్‌ ఇవ్వడం కోసమే ఆపినట్లు ప్రచారం జరుగుతోంది.
* సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌తో పాటూ ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొదటి జాబితాలో స్థానం దక్కలేదు. తాజాగా తుమ్మలకు ఖమ్మం..పొంగులేటికి పాలేరు సీట్లు ఇచ్చేలా నిర్ణయం జరిగిన సంగతి తెలిసిందే.

మల్‌ రెడ్డికి షాక్‌..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టికెట్ ఆశిస్తున్న మల్ రెడ్డి రంగారెడ్డి పేరు మొదటి లిస్ట్ లో రాలేదు. దీంతో ఆయన తన ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శేరిగూడ గ్రామంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలపై ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ మొదటి జాబితా వెలువడింది. లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఆయన ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఆందోళనలో కొండా వర్గం

వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కొండా సురేఖకు ఖాయమని ప్రచారం జరగగా.. ఆమె పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో లేదు. మొదటి జాబితాలో కొండా దంపతుల పేరు రాకపోవడంపై కొండా అభిమానులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ 2018 సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ రద్దు చేసి అదే రోజు 105 మంది పార్టీ సభ్యులతో తొలి జాబితా విడుదల చేశారు. అప్పుడు కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

మొదటి జాబితాలో టికెట్‌ దక్కించుకున్న కొత్త వారు..

* నాగర్ కర్నూల్ - ఈ సీటును నాగం జనార్ధన్ రెడ్డికి కాదని ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్‌ కేటాయించారు.
* జహీరాబాద్ - ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆగం చంద్రశేఖర్‌కు జహీరాబాద్ టికెట్‌ కేటాయించారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా పని చేసిన గీతారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు.
* మల్కాజ్‌గిరి, మెదక్‌ - ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి బంపర్ ఆఫర్ కొట్టారు. ఆయనకు మల్కాజిగిరి నుంచి టికెట్ రాగా.. ఆయన తనయుడు రోహిత్‌కు మెదక్ సీటు కేటాయించారు.
* కొల్లాపూర్ - ఇక బీఆర్ఎస్ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్‌ టికెట్‌ కన్ఫార్మ్‌ అయ్యింది.
* వీరితో పాటూ మరికొందరు కొత్త వారితో కలిపి మొత్తం 11 మంది కొత్త అభ్యర్థులు తొలి జాబితాలో సీటు దక్కించుకున్నారు.

బీసీ డిమాండ్ నెరవేరేనా?

55 మంది అభ్యర్థులతో విడుదల చేసిన కాంగ్రెస్‌ తొలి జాబితాలో బీసీలకు 11 సీట్లను మాత్రమే కేటాయించారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఇంకా 64 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ మిగిలిన 64 సీట్లలో ఎంత మంది బీసీలకు టికెట్లు కేటాయించనున్నారో అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. తమకు కనీసం 34 స్థానాలను కేటాయించాలని బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లిస్ట్‌లో కేవలం 11 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించడంతో.. బీసీ నేతల్ని సంతృప్తి పరచాలంటే కనీసం 20 సీట్లు అయినా సెకండ్‌ లిస్ట్‌లో బీసీ అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. అయితే రెండో జాబితాలోనూ పది, పన్నెండు సీట్లకు మించి బీసీలకు కేటాయించే పరిస్థితి లేదని టాక్‌ వినిపిస్తుండటంతో బీసీ నేతల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ తొలి జాబితా

1. బెల్లంపల్లె - గడ్డం వినోద్
2. మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
3. నిర్మల్ - కూచాడి శ్రీహరి రావు
4. ఆర్మూర్ - ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
5. బోధన్ - పి.సుదర్శన్ రెడ్డి
6. బాల్కొండ - సునీల్ కుమార్ ముత్యాల
7. జగిత్యాల - టి.జీవన్ రెడ్డి
8. ధర్మపురి - అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9. రామగుండం - ఎమ్మెస్ రాజ్ ఠాకూర్
10. మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
11. పెద్దపల్లి - చింతకుంట విజయ రమణారావు
12. వేములవాడ - ఆది శ్రీనివాస్
13. మానకొండూర్ - డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
14. మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు
15. ఆందోల్ - సి.దామోదర్ రాజనర్సింహ
16. జహీరాబాద్ - ఆగం చంద్ర శేఖర్
17. సంగారెడ్డి - తురుపు జగ్గారెడ్డి
18. గజ్వేల్ - తూంకుంట నర్సారెడ్డి
19. మేడ్చల్ - తోటకూర వజ్రేష్ యాదవ్
20. మల్కాజిగిరి - మైనంపల్లి హనుమంతరావు
21. కుత్బుల్లాపూర్ - కొలన్ హన్మంత్ రెడ్డి
22. ఉప్పల్ - ఎం.పరమేశ్వర్ రెడ్డి
23. చేవెళ్ల - పమేనా భీం భారత్
24. పరిగి - టి.రామ్మోహన్ రెడ్డి
25. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
26. ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్
27. మలక్‌పేట్ - షేక్ అక్బర్
28. సనత్‌నగర్ - కోట నీలిమ
29. నాంపల్లి - మహమ్మద్ ఫిరోజ్ ఖాన్
30. కార్వాన్ - ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
31. గోషామహల్ - మొగిలి సునీత
32. చాంద్రాయణగుట్ట - బోయ నగేష్ (నరేష్)
33. యాకుత్‌పురా - కె.రవి రాజు
34. బహదూర్‌పురా - రాజేష్ కుమార్ పులిపాటి
35. సికింద్రాబాద్ - ఆడమ్ సంతోష్ కుమార్
36. కొడంగల్ - రేవంత్ రెడ్డి
37. గద్వాల్ - సరితా తిరుపతయ్య
38. అలంపూర్ - ఎస్.ఎ.సంపత్ కుమార్
39. నాగర్ కర్నూల్ - డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
40. అచ్చంపేట - డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ
41. కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణరెడ్డి
42. షాద్‌నగర్- కె.శంకరయ్య
43. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
44. నాగార్జున సాగర్ - జయవీర్ కుందూరు
45. హుజూర్‌నగర్ - ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
46. కోదాడ - ఎన్.పద్మావతి రెడ్డి
47. నల్గొండ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
48. నకిరేకల్ - వేముల వీరేశం
49. ఆలేరు - బీర్ల ఐలయ్య
50. ఘన్‌పూర్ (స్టేషన్) - సింగపురం ఇందిర
51. నర్సంపేట - దొంతి మాధవ రెడ్డి
52. భూపాలపల్లె - గండ్ర సత్యనారాయణరావు
53. ములుగు - దనసరి అనసూయ (సీతక్క)
54. మధిర - మల్లు భట్టి విక్రమార్క
55. భద్రాచలం - పొదెం వీరయ్య

తొలి జాబితాలో బీసీలకు కేటాయించిన సీట్లు

1. వేములవాడ - ఆది శ్రీనివాస్
2. మేడ్చల్ - తోటకూర వజ్రేష్ యాదవ్
3. సనత్ నగర్ - కోట నీలిమ
4. గోషామహల్ - మొగిలి సునీత
5. చాంద్రాయణగట్ట - బోయ నగేష్
6. యాకుత్ పుర - రవి రాజు
7. బహదూర్‌పుర - రాజేష్ కుమార్ పులిపాటి
8. సికింద్రాబాద్ - ఆడం సంతోష్
9. గద్వాల - సరిత
10. ఆలేరు - బీర్ల ఐలయ్య
11. షాద్ నగర్ - శంకరయ్య

Also Read:

CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ తీరు అమానవీయం..పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు