Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు!

త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీని తొలగించనున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బాఘేల్‌‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో భారీగా మార్పులకు అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీని తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తగా చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌ తర్వాత ఖరారయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

దీపాదాస్‌ మున్షీని పశ్చిమబెంగాల్‌కు పంపిస్తారని చర్చ జరుగుతోంది. కొత్త ఇన్‌ఛార్జితోపాటు కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టులపైనా సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. చత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్నారు భూపేష్‌ బాఘేల్‌. మొన్నటి వరకు చత్తీస్‌గడ్‌ సీఎంగా పని చేశారు. ప్రియాంకకు అత్యంత నమ్మకస్తుడిగా భూపేష్‌ బాఘేల్‌ ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు