Congress Chevella Sabha: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా!

ఎన్నికల వేళ చేవెళ్ల సభను అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తుంటే..సభ మాత్రం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సభ ఆగష్టు 18 న జరగాల్సి ఉండే. అయితే సభ నిర్వహణకు సమయం సరిపోకపోవడం ఇంకా వివిధ కారణాలతో సభను ఈ నెల 24 కు వాయిదా చేశారు. అయితే సభను మరోసారి వాయిదా వేస్తూ.. 24 నుంచి ఈ నెల 26 కు తేదీని మార్చినట్టు టీపీసీసీ వెల్లడించింది

New Update
Congress Chevella Sabha: కాంగ్రెస్ చేవెళ్ల సభ మరోసారి వాయిదా!

Congress Chevella Sabha: ఎన్నికల వేళ చేవెళ్ల సభను అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తుంటే..సభ మాత్రం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ సభ ఆగష్టు 18 న జరగాల్సి ఉండే. అయితే సభ నిర్వహణకు సమయం సరిపోకపోవడం ఇంకా వివిధ కారణాలతో సభను ఈ నెల 24 కు వాయిదా చేశారు.

అయితే సభను మరోసారి వాయిదా వేస్తూ.. 24 నుంచి ఈ నెల 26 కు తేదీని మార్చినట్టు టీపీసీసీ వెల్లడించింది.ఇక ఈ సభ ద్వారా భారీ ఎత్తున జనసమీకరణను చేసి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను వెల్లడించాలని టీపీసీసీ సీనియర్లు ప్లాన్ వేశారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వస్తారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకే 24న రాజస్థాన్ లో ముఖ్యమైన పర్యటన ఉంది.. దీంతో చేవెళ్ల సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లు చేసిన కాంగ్రెస్ కు ఇవి మంచి మైలేజ్ ను ఇచ్చాయి. దీంతో చేవెళ్ల సభ ద్వారా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కూడా చేయాలని టీపీసీసీ శ్రేణులు భావిస్తున్నాయి. కాని సభ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండడంతో.. శ్రేణులు నిరుత్సాహ పడుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు