CM Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టు కీలక నిర్ణయం?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో విచారించేందుకు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కస్టడీకి ఇవ్వొద్దు అంటూ కేజ్రీవాల్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

కేజ్రీవాల్ కు షాక్..

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలిగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడ్డ కేజ్రీవాల్ కు సీఎంగా ఉండే అర్హత లేదని.. ఆయన్ను వెంటనే సీఎం పదవి నుంచి తొలిగించాలని పిటిషన్ లో కోరారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు