ఇవాళ్టి నుంచి రుణమాఫీ.. రైతన్నకు కేసీఆర్ వరాలు

రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 03) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ 45రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.

New Update
హైదరాబాద్ భూముల ధరలు.. తెలంగాణ పరపతికి దర్పణం: సీఎం కేసీఆర్

CM KCR: రైతన్నపై సీఎం కేసీఆర్ వరాలు ఇచ్చారు. రైతులకు ఇవాళ్టి (ఆగస్టు 3) నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో అధికారులతో చర్చించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్(CM KCR) పేర్కొన్నారు. ఎన్నికష్టాలు ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి వుంటుందని తేల్చి చెప్పారు. రైతులకు రైతుబంధు(Rythu Bandhu), రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కొనసాగిస్తోందన్నారు.

కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం, కరోనా వల్ల వచ్చిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం(FRBM) నిధులను విడుదలచేయకుండా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన కక్షపూరిత చర్యలు మొదలైన కారణాల వల్ల ఆర్థిక లోటు వచ్చిందన్నారు. అందుకే రుణమాఫీ కొంత ఆలస్యమైందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను తమ ప్రభుత్వం విస్మరించబోదన్నారు.

వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. రైతులకు సాధికారత వచ్చే వరకు, వారిని ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసకు వచ్చే వరకు విశ్రమించబోమన్నారు. గతంలో అందించిన రుణమాఫీ పోగా మరో రూ. 19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందన్నారు.

Also Read: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్‌..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు