CM Jagan: వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

author-image
By V.J Reddy
New Update
EX CM Jagan: జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు!

CM Jagan: వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. వైఎస్‌ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. వైఎస్‌ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారని.. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు? అని షర్మిలను, వివేకా కూతురు సినీతా రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?, వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?, అవినాష్‌ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అని ప్రశ్నించారు. అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చానని అన్నారు. అవినాష్‌ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు