CM JAGAN: మరో 70 రోజుల్లో ఎన్నికలు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని.. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకొని తిరుగుతున్నారని సీఎం జగన్ చురకలు అంటించారు. మరో 70 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని.. చంద్రబాబు సహా అందరిని ఓడించాలని పిలుపునిచ్చారు.

New Update
AP Tragedy : వైఎస్ జగన్‌ సభలో అపశ్రుతి..తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త మృతి.!

CM Jagan Bheemili Meeting: ఏపీలో రానున్న ఎన్నికల (AP Elections 2024) కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో  'సిద్ధం' (YSRCP Siddham) పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

నేను అర్జునుడిని..

అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోందని అన్నారు సీఎం జగన్. ఇక్కడకు వచ్చిన ప్రతీ అక్క, చెల్లెమ్మల్లోనూ, ప్రతి అన్న, తమ్ముడిలోనూ, ప్రతి అవ్వలోనూ నాకు సేనాధిపతులే కనిపిస్తున్నారని అన్నారు. 'ఇటు పక్క పాండవ సైన్యం ఉంది.. అటు పక్క కౌరవ సైన్యం ఉంది.. అక్కడ పద్మ వ్యూహం పొంచి ఉంది.. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ అభిమన్యుడు కాదు ఉన్నది.. ఇక్కడ ఉన్నది అర్జునుడు.. ఈ అర్జునుడికి తోడు కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారు' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఆ దైర్యం లేదు...

రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఒంటరిగే పోటీ చేసే ధైర్యం లేదని అన్నారు సీఎం జగన్. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం చూస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో సహా అందరిని ఓడించాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ టార్గెట్ 175 కి 175 స్థానాల్లో గెలుపు అని అన్నారు. మనం చేసే మంచే మనల్ని గెలిపిస్తుందని అన్నారు.

70 రోజుల్లో ఎన్నికలు...

మరో 70 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు సీఎం జగన్. ఈ ఎన్నికల్లో వైసీపీని (YCP) అధికారంలోకి తేవాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ విఫలమైంది..

గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి (TDP) రావు అని అన్నారు సీఎం జగన్ (CM Jagan). 'మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం. పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా. 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను. ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి. ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది. ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది. మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు. మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం. చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు. మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు. ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం' అని వ్యాఖ్యానించారు.

ALSO READ: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి… షర్మిల సంచలన వ్యాఖ్యలు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు