YSR Congress Party: చంద్రబాబే రాళ్లతో కొట్టమన్నాడు.. వైసీపీ సంచలన వీడియో సీఎం జగన్‌పై జరిగిన రాళ్ల దాడిపై వైసీపీ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ దాడికి చంద్రబాబే కారణమని పేర్కొంది. చంద్రబాబు రాళ్లతో కొట్టాలని ప్రజలను ప్రేరేపించిన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By V.J Reddy 14 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి YSR Congress Party: సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై వైసీపీ సంచలన వీడియోను విడుదల చేసింది. ఈ దాడికి చంద్రబాబే కారణమని పేర్కొంది. చంద్రబాబు రాళ్లతో కొట్టాలని ప్రజలను ప్రేరేపించినా వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండ బహిరంగ సభలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారని పేర్కొంది. రాయి తీసుకుని ఫ్యాన్ పై దాడి చేయాలని చంద్రబాబు వారిని రెచ్చగోట్టారని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు స్పీచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే సీఎం జగన్ పై దాడి జరిగినట్లు పేర్కొంది. ఈ దాడికి చంద్రబాబే కారణమని తెలిపింది. చంద్రబాబు పిలుపు ఇవ్వడం వల్లే ఈ దాడి జరిగిందని సోషల్ మీడియాలో వీడియోను వైసీపీ షేర్ చేసింది. జగనన్నపై రాళ్ల దాడి చేయమని పచ్చ గూండాలని రెచ్చగొట్టిన చంద్రబాబు! తాడికొండ బహిరంగ సభలో @JaiTDP కేడర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు. రాయి తీసుకుని సీఎం @ysjagan గారిపై దాడి చేయాలని ఆదేశం.. చంద్రబాబు స్పీచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే జగనన్నపై దాడి!#EndOfTDP pic.twitter.com/UMbW1HC1wl — YSR Congress Party (@YSRCParty) April 14, 2024 విచారణకు సిట్ ఏర్పాటు.. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి విచారణ జరుపుతోంది. అజిత్‌సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మొత్తం ఆ స్థలంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం వద్ద ఉన్న ఓ స్కూల్ భవనం నుంచి రాళ్లు విసిరారు అని అనుమానంతో ఆ స్కూల్ వాచ్ మెన్ ను అధికారులు విచారిస్తున్నారు. త్వరలో ఈ దాడి ఎవరు చేశారనే దానిపై క్లారిటీ రానుంది. #chandrababu #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి