CM Jagan: సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం

AP: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సతీష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో సతీష్ ను హాజరుపర్చారు. కాగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
CM Jagan: సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం

CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను (Sathish) అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సతీష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో సతీష్ ను పోలీసులు హాజరుపర్చారు. కాగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ పై జరిగిన దాడిలో సతీష్ ఏ1 గా ఉన్నాడు. ఇదే సతీష్ కు సహకరించిన దుర్గారావు సహా మరో ఐదుగురు యువకులను పోలీసులు విచారించారు.

అసలేమైంది..

ఈ నెల 13న విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.

కేసు విచారణకు సిట్ ఏర్పాటు..

సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో విచారణకు సిట్ ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు సీపీ క్రాంతి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కొరకు ఆరు ప్రత్యేక అధికారుల బృందం రంగంలోకి విచారణ జరుపుతోంది. అజిత్‌సింగ్ నగర్ లో మూడు సెల్ ఫోన్ టవర్స్ నుంచి అధికారులు డంప్ స్వాధీనం చేసుకున్నారు. కాగా మొత్తం ఆ స్థలంలో 20 వేల సెల్ ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జగన్ రూట్ మ్యాప్ లో ఉన్న అన్ని సీసీ టీవీ కెమెరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం వద్ద ఉన్న ఓ స్కూల్ భవనం నుంచి రాళ్లు విసిరారు అని అనుమానంతో ఆ స్కూల్ వాచ్ మెన్ ను అధికారులు విచారిస్తున్నారు.

Also Read: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ

Advertisment
Advertisment
తాజా కథనాలు