CM Chandrababu: ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదలకు సిద్దమైన చంద్రబాబు

AP: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేయనున్నారు.

New Update
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

CM Chandrababu: నాలుగో శ్వేత పత్రం విడుదలకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఈ నెల 18న శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. కాగా ఇటీవల విద్యుత్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు మాట్లాడుతూ.. వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ శాఖ చూసిన తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. తవ్వినకొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని అన్నారు. విద్యుత్‌తో.. ప్రతి ఒక్కరి జీవతం ముడిపడి ఉందని చెప్పారు. విద్యుత్‌తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్‌ కొరత ఉందని తెలిపారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం అని అన్నారు. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు