CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈరోజు టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

New Update
CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

CM Chandrababu: తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను బలపరిచేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపైనా చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం టీ-టీడీపీ నేతలు చంద్రబాబుకు ఘనసన్మానం చేయనున్నారు.

టీటీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ఈరోజు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటించడంతో అప్పుడు తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఇంఛార్జిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో ఖాళీ గా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి పదవిని చంద్రబాబు ఇంకా భర్తీ చేయలేదు. దీనిపై ఈరోజు చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి ఏపీలో వలె తెలంగాణలో కూడా టీడీపీని పోటీలో ఉంచనున్నారు. కాగా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు