AP: కాన్వాయ్ ఆపి ప్రజల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..! సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. ప్రజల సమ్యసలు తెలుసుకుని పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారుదిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. #chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి