CM Chandrababu: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్‌ షాక్‌

AP: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. పులివెందుల జగనన్న మెగా లేఅవుట్‌ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సీఎంకు కంప్లైంట్‌ ఇచ్చారు.

New Update
CM Chandrababu: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్‌ షాక్‌

CM Chandrababu: మాజీ సీఎం జగన్‌కు (YS Jagan) చంద్రబాబు సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. పులివెందుల (Pulivendula) జగనన్న మెగా లేఅవుట్‌ అక్రమాలపై విచారణకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గత ప్రభుత్వం టైమ్‌లో పులివెందులకు 8400 ఇళ్ల మంజూరు చేశారు. అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎంకు కంప్లైంట్‌ ఇచ్చారు.

పథకంలో భాగంగా మూడేళ్ల కిందట స్థలాలు మంజూరు చేయగా.. ఇప్పటికీ ఇంకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది గత ప్రభుత్వం. మూడేళ్లలో కేవలం 99 ఇళ్లు మాత్రమే నిర్మాణం జరిగింది. రూ.84.70 కోట్ల బిల్లులు చెల్లించింది గృహనిర్మాణ సంస్థ. పులివెందులలో అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిఅక్కడ నిలిచిపోయాయి.

Also Read: ఇవాళ హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు