Harsha Sai : ఎట్టకేలకు బయటికొచ్చిన హర్షసాయి.. కేసుపై ఏమన్నాడంటే!?

యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో..' నేను ఏ తప్పు చేయలేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు.

New Update

 
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై ఇటీవల ఓ నటి కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకోని, తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని సదరు నటి అతనిపై పోలీసులకు పిర్యాదు చేసింది. అప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ఇక ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. హర్షసాయి ఇన్నాళ్లూ విదేశాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. 

చిన్న పని మీద వెళ్ళాను..

ఉన్నట్టుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్  కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ.." నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదు. ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడ పని పూర్తి చేసుకుని నేడు తిరిగి హైదరాబాద్ వచ్చాను. 

Also Read : ప్రభాస్ కు జోడిగా నయనతార.. 17 ఏళ్ళ తర్వాత క్రేజీ కాంబో రిపీట్

నా మీద వచ్చినటువంటి ఆరోపణలు అసత్యం కాబట్టే నాకు బెయిల్ మంజూరు అయింది. నేను రాసిన నేను తీసినటువంటి సినిమాకి వాళ్లే కాపీరైట్స్ అడిగారు. నేను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా అదే జరిగింది. మధ్యలో ఉన్నటువంటి కొందరు ఈ విధంగా కావాలని నన్ను ప్రజలలో చులకన చేయడానికి నా ఇమేజ్ ను దెబ్బతీయడానికి అసత్య ప్రచారాలు చేశారు. కానీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటికి వచ్చేయి కాబట్టే ఈ రోజు నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది.." అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే

హీరో ల్లు అర్జున్ తన పేరును మార్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  న్యూమరాలజీ ఆధారంగా తన పేరులోని స్పెల్లింగ్‌ను మార్చే ఆలోచనలో అల్లు అర్జున్  ఉన్నారని తెలుస్తోంది. రెండు అదనపు U'లు, N'లను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. 

New Update

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ స్టార్ డమ్ మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1870 కోట్లకు పైగా వసూళ్లతో.. ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. దీంతో దేశమంతా బన్నీ పేరు మారుమోగింది. అల్లు అర్జున్ అంటే పేరు కాదు బ్రాండ్ అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు. 

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

పేరు మార్చుకోనున్న అల్లు అర్జున్ 

ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  పలు నివేదికల ప్రకారం అల్లు అర్జున్ తన పేరును మార్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  న్యూమరాలజీ ఆధారంగా బన్నీ తన పేరులోని స్పెల్లింగ్‌ను మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రెండు అదనపు U'లు, N'లను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అల్లు అర్జున్ లేదా అతడి టీమ్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

PUSHPA 2
PUSHPA 2

 
 
ఇదిలా ఉంటే బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై రోజురోజుకూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి #AA22 అనే పాన్ ఇండియా మూవీకి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్  అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక చిత్రాన్ని లైన్లో పెట్టారు. ఇందులో బన్నీ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్. 

latest-news | cinema-news | allu-arjun | allu arjun changing name

Also Read: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' ట్రైలర్! నవ్వులే నవ్వులు

Advertisment
Advertisment
Advertisment