యూట్యూబర్ హర్షసాయికి షాక్! యూట్యూబర్ హర్షసాయి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోసం హర్షసాయి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని వారిని కోర్టు ప్రశ్నించింది. By V.J Reddy 04 Oct 2024 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, ఇమ్రాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈరోజు విచారించిన ధర్మసం.. కేసులో నిందితులుగా చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. వారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్‌కు రావాలని వారికి సూచనలు చేసింది. కాగా ఇప్పటికే హర్షసాయితో పాటు హర్ష తండ్రి, ఇమ్రాన్ పై బాధితురాలి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నన్ను మోసం చేశాడంటూ... ఇటీవల ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. హర్ష సాయితో పాటు అతని తండ్రిపై కూడా కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లి పేరుతో రూ. 2కోట్లు తీసుకొని తనను మోసం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలో నిజాలు బయటకు.... తనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు వివరిస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్కు తెలుసు' అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. అటు హర్షసాయి కోసం HYD పోలీసులు గాలిస్తున్నారు. #harsha-sai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి