Toxic Postpone: యష్ 'టాక్సిక్' మళ్ళీ పోస్ట్ పోన్.. రిలీజ్ ఎప్పుడంటే..?

యష్ టాక్సిక్ విడుదల జూన్ 4, 2026 నుంచి వాయిదా పడింది. యష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. దీనితో అభిమానులు నిరాశలో ఉన్నారు.

New Update
Toxic Postpone

Toxic Postpone

Toxic Postpone: యష్(Yash) నటిస్తున్న భారీ చిత్రం Toxic: A Fairy Tale for Grown-ups విడుదల మరోసారి వాయిదా పడింది. ముందు ప్రకటించిన ప్రకారం ఈ సినిమా 2026 జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా చిత్రబృందం ఆ తేదీని రద్దు చేసినట్లు అధికారికంగా తెలిపింది.

గీతూ మోహన్‌దాస్ Geetu Mohandas దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. KGF తర్వాత యష్ సినిమాను చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మళ్లీ వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

మేకర్స్ మాత్రం ఇది వ్యూహాత్మక నిర్ణయమని చెబుతున్నారు. సినిమాను ఇంకా పెద్ద స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి, క్వాలిటీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే కొత్త విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

ఈ సినిమాలో నయనతార Nayanthara, కియారా అద్వానీ Kiara Advani, హుమా ఖురేషి Huma Qureshi, తారా సుతారియా Tara Sutaria, రుక్మిణి వసంత్ Rukmini Vasanth, టొవినో థామస్ Tovino Thomas, అక్షయ్ ఒబెరాయ్ Akshay Oberoi వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంగీతాన్ని రవి బస్రూర్‌ Ravi Basrurతో పాటు తనిష్క్ బాగ్చిTanishk Bagchi, ఫహీమ్ అబ్దుల్లా Faheem Abdullah అందిస్తున్నారు.

ఈ వాయిదా కారణంగా ఇతర సినిమాల విడుదల షెడ్యూల్స్ కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అభిమానులు కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు