Yash Ramayana: ప్లాన్ చేంజ్.. యష్ 'రామాయణ' ముందుగానే వస్తోందిగా!

రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రామాయణ విడుదల తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. మొదట దీపావళి 2026కి ప్లాన్ చేసిన ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

New Update
Yash Ramayana

Yash Ramayana

Yash Ramayana: బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల్లో "రామాయణ" ఒకటి. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో యశ్, సాయి పల్లవి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మొదట ఈ సినిమాను 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'రామాయణ: పార్ట్ 1' ను అనుకున్న తేదీ కంటే వారం ముందే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాను అక్టోబర్ 30, 2026న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు విడుదల ప్లానింగ్‌పై నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

నిర్మాత నమిత్ మల్హోత్రా సినిమా దీపావళి కంటే ముందే విడుదలైతే మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. మొదటి వారం కంటే రెండో వారం కలెక్షన్లు ఇంకా పెద్ద స్థాయిలో రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దీపావళి సెలవుల సమయంలో ప్రేక్షకుల స్పందన మరింత పెరుగుతుందని, అప్పుడు సినిమా బిజినెస్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అందుకే ముందుగానే విడుదల చేసి, పండుగ సమయానికి సినిమాను మరింత బలంగా నిలబెట్టాలని భావిస్తున్నారట.

ఇప్పటికే విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు