/rtv/media/media_files/2026/05/27/salbardi-2026-05-27-16-26-16.jpg)
Salbardi
Salbardi: ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో థ్రిల్లర్ సినిమాలకు రోజురోజుకీ మంచి ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా మరాఠీ సినిమా ‘సల్బర్డి’ (Salbardi) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా ఒక దూరంగా ఉండే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో చీకటి పడితేనే ప్రజలు భయంతో తలుపులు మూసేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వరుసగా వింత వింత మరణాలు జరుగుతుంటాయి. ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. దీంతో ఆ మరణాల చుట్టూ దైవ శాపం, ఆత్మలు, బలి వంటి నమ్మకాలు కూడా ఉంటాయని అంటుంటారు.
ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కోసం ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ గ్రామానికి వస్తుంది. ఆమె పేరు మనోరమ ప్రధాన్. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఆమెకు గ్రామంలోని పాత బంగ్లా చుట్టూ అనేక రహస్యాలు కనిపిస్తాయి. బయటికి మూఢనమ్మకాల కథలా కనిపించినా, లోపల మాత్రం పెద్ద కుట్ర దాగి ఉందని ఆమెకు అర్థమవుతుంది.
దర్యాప్తు కొనసాగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక భయాలు ఆమెపై పెరుగుతాయి. అయినా మనోరమ వెనక్కి తగ్గకుండా ఒక్కో క్లూ వెంబడి అసలు నేరస్థుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
ఈ సినిమాను రమేష్ సాహెబ్‌రావు చౌదరి దర్శకత్వం వహించారు. 2026 ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 22 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో పూజా సావంత్ మనోరమ ప్రధాన్ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. సొనాలీ కుల్కర్ణి ‘మంజుల’ అనే కీలక పాత్రలో కనిపించగా, గష్మీర్ మహాజని ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశాడు. అలాగే శశాంక్ షెండే, ఓంకర్ భోజనే, భరత్ గణేష్‌పురే వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించి సినిమాకు బలం ఇచ్చారు.
మొత్తంగా ‘సల్బర్డి’ ఒక డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచేలా సాగుతుంది.
Follow Us