/rtv/media/media_files/2026/04/10/jana-nayagan-2026-04-10-08-07-41.jpg)
Jana Nayagan
Jana Nayagan: తలపతి విజయ్ చివరి సినిమాగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జనా నాయకన్' సినిమా విడుదలకు ముందే పెద్ద సమస్యలో పడింది. జనవరి 2026 నుంచి ఈ సినిమా ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది. హెచ్. వినోత్ దర్శకత్వంలో, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇప్పుడు లీక్ సమస్యతో మరింత కష్టాల్లో పడింది.
మొదట ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. దీనిపై అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొద్ది గంటల్లోనే మొత్తం సినిమా కూడా అక్రమ వెబ్‌సైట్లలో లభ్యమైంది. దీంతో ఎవరైనా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
Jana Nayagan Full Movie Leaked Online
🚨 ATTENTION Thalapathy Fans!
— OTT WEEK 🇮🇳 (@OTTWEEK) April 10, 2026
Jana Nayagan has been illegally leaked on social media. 💔
We know the excitement is REAL — but watching a pirated copy is NOT how we show love to our #Thalapathy.
✅ The entire cast & crew worked YEARS for this.
Every ticket sold = a direct… pic.twitter.com/Iu2dAYoDLx
ఈ ఘటనపై దర్శకుడు హెచ్. వినోత్ స్పందిస్తూ, “ప్రతి సీన్ వెనుక చాలా మంది కన్న కలలు ఉంటాయి. రిలీజ్‌కు ముందే ఇలా లీక్ అవడం చాలా బాధగా ఉంది. దయచేసి ఈ వీడియోలను షేర్ చేయొద్దు” అని కోరారు.
సినిమా విడుదలకు ముందే పూర్తి ప్రింట్ బయటకు రావడం చాలా పెద్ద విషయం. కొన్ని వర్గాలు ఇది ప్లాన్ చేసి చేసిన పని కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ముందు ఈ ఘటన జరగడం కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇంకా సర్టిఫికేట్ రాకపోవడంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇప్పుడు మొత్తం సినిమా లీక్ కావడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్థిక నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితి గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాకు కూడా ఎదురైంది. అప్పట్లో టీమ్ వెంటనే రిలీజ్ ముందుకు తీసుకువచ్చి పెద్ద హిట్ సాధించింది. కానీ 'జనా నాయకన్' విషయంలో అది సాధ్యమవుతుందా అనేది సందేహంగా ఉంది, ఎందుకంటే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు.
ఇప్పటికే సినిమా థియేట్రికల్, డిజిటల్ హక్కులు అమ్ముడైపోయాయి. కాబట్టి టీమ్ త్వరగా సెన్సార్ పూర్తి చేసి, ఎన్నికల తర్వాత వెంటనే సినిమా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది.
విజయ్ అభిమానులు ఆయన చివరి సినిమాను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ లీక్ ఘటన వారిని నిరాశకు గురిచేసింది. ఈ సమస్య నుంచి టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి. అయినా కూడా, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
Follow Us