/rtv/media/media_files/2026/05/05/vijay-trisha-2026-05-05-11-38-34.jpg)
Vijay Trisha
Vijay Trisha: తమిళ సినిమా ఇండస్ట్రీలో విజయ్ Vijay, త్రిష Trisha Krishnan జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే సినిమాపై క్రేజ్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో గెలిచి సీఎం అయిన నేపథ్యంలో, ఈ జంటపై మరోసారి చర్చ మొదలైంది.
ఇప్పటివరకు విజయ్, త్రిష కలిసి మొత్తం 5 సినిమాల్లో నటించారు.
Vijay Trisha Movies List
వారి మొదటి సినిమా ‘గిల్లి’ (2004). యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపిన ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. విజయ్ కెరీర్‌లోనే ఒక ముఖ్యమైన మలుపుగా దీనిని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ జంట కెమిస్ట్రీని చాలా ఇష్టపడ్డారు.
తర్వాత వీరిద్దరూ ‘తిరుపాచి’ సినిమాలో నటించారు. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు ప్రధానంగా ఉన్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. విజయ్‌ను మాస్ హీరోగా మరింతగా నిలబెట్టింది.
2006లో వచ్చిన ‘ఆది’ సినిమాలో కూడా ఈ జంట కలిసి కనిపించింది. ఇది రివెంజ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నడిచిన సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరు విజయం సాధించింది.
Also Read: ‘దళపతి’ టూ ‘సీఎం’ విజయ్.. విక్టరీతో మారిన ‘జన నాయకన్’ టైటిల్..!
ఆ తర్వాత 2008లో ‘కురువి’ సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో యాక్షన్ సీన్స్, స్టైల్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమా కూడా యావరేజ్‌గా నిలిచింది.
దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత, 2023లో ‘లియో’ సినిమాలో ఈ జంట మళ్లీ కలిసింది. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది. త్రిష కీలక పాత్రలో నటించి కథకు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read: ‘ఫౌజీ’ షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!
మొత్తంగా చూస్తే, విజయ్-త్రిష జంట ఇప్పటివరకు 5 సినిమాల్లో నటించగా, వాటిలో ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘లియో’ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఈ జంటకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు.
Follow Us