/rtv/media/media_files/2026/04/15/hai-jawani-toh-ishq-hona-hai-2026-04-15-07-58-14.jpg)
Hai Jawani Toh Ishq Hona Hai
Hai Jawani Toh Ishq Hona Hai Teaser
Hai Jawani Toh Ishq Hona Hai: బాలీవుడ్‌లో వస్తున్న కొత్త సినిమా Hai Jawani Toh Ishq Hona Hai టీజర్ విడుదలైన ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ David Dhawan తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ Varun Dhawan, పూజా హెగ్డే Pooja Hegde, మృణాల్ ఠాకూర్ Mrunal Thakur ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టీజర్ ప్రారంభంలో ఇద్దరు పిల్లలు తమ తల్లుల గురించి మాట్లాడే సన్నివేశం ఉంటుంది. చివరికి వాళ్లిద్దరికీ ఒకే తండ్రి అని చూపించడం కొంచెం విభిన్నంగా అనిపించినా, అది కొందరికి ఓవర్ అనిపించింది. ఈ సన్నివేశంలో AI టెక్నాలజీ వాడినట్టు తెలుస్తోంది, కానీ అదే అంశం పై విమర్శలు కూడా వస్తున్నాయి.
మొత్తం టీజర్ చూస్తే కథ చాలా పాత స్టైల్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. కొత్తదనం తక్కువగా ఉందని కొంతమంది భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది పూర్తి వినోదాత్మక సినిమా అవుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈ టీజర్‌పై భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు దీన్ని పాత కథలా ఉందని ట్రోల్ చేస్తుండగా, ఇంకొందరు మాస్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నారు.
ఇటీవల వరుణ్ ధావన్ Varun Dhawan సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అందుకే ఈ సినిమా ఆయనకు చాలా ముఖ్యంగా మారింది. ఈ చిత్రం మే 22న విడుదల కానుంది. విడుదల తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow Us