Ustaad Bhagat Singh: 'ఉస్తాద్'కు భారీ దెబ్బ.. అక్కడ మార్కెట్‌లో ఫ్లాప్ పర్ఫార్మెన్స్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ అమెరికా థియేట్రికల్ రైట్స్ ₹10 కోట్లు వద్ద అమ్ముడయ్యినా, ఫస్ట్ డే కలెక్షన్స్ $500K కంటే తక్కువగా వచ్చాయి. రెండు రోజుల్లో $600K మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ $2.4M కావడంతో, ఇన్వెస్టర్లు 60%కంటే ఎక్కువ నష్టాలు భరించాల్సి వస్తుంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ Pawan Kalyan హీరోగా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అమెరికాలో భారీ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందంతో రిలీజ్ అయ్యింది. USA థియేట్రికల్ రైట్స్ ₹10 కోట్లు వద్ద అమ్ముడయ్యాయి. మొదట ట్రేడ్ విశ్లేషకులు $2.3M–$2.4M వద్ద బ్రేక్ ఈవెన్ సాధ్యమని భావించారు, ఎందుకంటే OG సినిమా ప్రీమియర్‌ల నుండి $3M+ కలెక్షన్స్ సాధించింది.

కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్‌లలో $500K కంటే తక్కువ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది. అమెరికా ప్రీమియర్ షోలు, మొదటి రివ్యూలు, వర్డ్-ఆఫ్-మౌత్ నెగెటివ్ గా ఉండటంతో సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద ఆదరణ తగ్గింది.

Ustaad Bhagat Singh USA Collections

రెండు రోజుల కింద, USA కలెక్షన్స్ సుమారు $600K మాత్రమే. $2.4M బ్రేక్ ఈవెన్ అవసరమని భావిస్తే, $1M కూడా చేరడం కూడా కష్టంగా మారింది. భారీగా థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు 60%కంటే ఎక్కువ నష్టాలు భరించాల్సి వస్తుందని అంచనా.

ఈ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ అమెరికా మార్కెట్‌లో ప్రీ-రిలీజ్ బజ్, వర్డ్-ఆఫ్-మౌత్ ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు