Ustaad Bhagat Singh Day 1: "ఉస్తాద్ భగత్ సింగ్" డే 1 కలెక్షన్స్.. పవన్ గత సినిమాలకంటే తక్కువే!

ఉగాది కానుకగా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో కలెక్షన్స్ బలంగా ఉండగా, తెలంగాణలో మిక్స్డ్ టాక్ వస్తోంది. అలాగే ఫస్ట్ డే గ్రాస్ సుమారు ₹50 కోట్లు, టికెట్ సేల్ 8.5 లక్షలకు చేరింది.

New Update
Ustaad Bhagat Singh Day 1

Ustaad Bhagat Singh Day 1

Ustaad Bhagat Singh Day 1: పవర్ స్టార్ Pawan Kalyan హీరోగా, హరీష్ శంకర్ Harish Shankar దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైంది. ఈ సినిమాకి శ్రీలీల, రాశి ఖన్నా Raashii Khanna హీరోయిన్లుగా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

రిలీజ్ రోజు ప్రేక్షకుల రెస్పాన్స్ మంచిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, టికెట్ ధరల పెంపుతో మంచి కలెక్షన్స్ సాధించింది. తెలంగాణలో ‘ధురంధర్ 2’ వంటి బడా బాలీవుడ్ సినిమా వల్ల కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికా మార్కెట్‌లో కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.

ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాల ప్రకారం, భారతదేశంలో సుమారుగా ₹38 కోట్లు గ్రాస్, వరల్డ్ వైడ్‌లో సుమారు ₹50 కోట్లు సాధించింది. ఏరియా వారీగా చూస్తే, నైజాం - ₹7.4 కోట్లు, సీడెడ్ - ₹3.9 కోట్లు, ఉత్తరాంధ్ర - ₹4.1 కోట్లు, గుంటూరు - ₹2.85 కోట్లు, కృష్ణ - ₹2.4 కోట్లు, ఈస్ట్ - ₹3.6 కోట్లు, వెస్ట్ - ₹2.5 కోట్లు, నెల్లూరు - ₹0.95 కోట్లు వసూలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల మొత్తం గ్రాస్ ₹27.7 కోట్లు చేరగా, ఓవర్‌సీస్‌లో ₹4 కోట్లు రాబట్టింది.

కాగా, ఫస్ట్ డే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే శ్రీరామనవమి, ఈద్ హాలిడేస్ సినిమాకు మంచి వసూళ్లను రాబడతాయని డిస్ట్రిబ్యూటర్స్ అంచనా వేస్తున్నారు. ఫ్యాన్స్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుండగా, సాధారణ ప్రేక్షకుల టాక్ మాత్రం మిక్స్‌గా ఉంది.

మొదట సినిమా విడుదల తేదీ మార్చి 26న అనుకున్నప్పటికీ, ఆ తేదీ కంటే ముందుగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక మంచి గిఫ్ట్‌గా నిలిచింది.

Advertisment
తాజా కథనాలు