/rtv/media/media_files/2026/03/19/ustaad-bhagat-singh-2026-03-19-07-49-29.jpg)
Ustaad Bhagat Singh Review
Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే చాలా మందికి వెంటనే “గబ్బర్ సింగ్” గుర్తొస్తుంది. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయింది. ఇప్పుడు అదే కాంబో మళ్లీ “ఉస్తాద్ భగత్ సింగ్” తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న ఈ సినిమా విడుదలైంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉండడం, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు మరింత పెరిగాయి. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మంచి బజ్ వచ్చింది.
కథ ఏమిటి?
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ “భగత్ సింగ్” అనే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. అన్యాయం ఎక్కడ జరిగినా అతను సహించడు. ఒక సమయంలో అతనిని గిరిజన ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
అక్కడ ఒక రాజకీయ నాయకుడు (పార్థీబన్) తన దౌర్జన్యాలతో ప్రజలను భయపెడుతూ అక్రమ పనులు చేస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో భగత్ సింగ్ అక్కడికి వచ్చి ఆ అన్యాయాలకు ఎలా ఎదురు నిలిచాడు? ఆ రాజకీయ నాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ ప్రయాణంలో శ్రీలీల, రాశీ ఖన్నా పాత్రలు ఎలా ఉంటాయి? అనేది కథ.
సినిమా ఎలా ఉంది?
సినిమా మొదట్లోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాస్ట్ గా సాగుతుంది. పవన్ కామెడీ, స్టైల్, డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
శ్రీలీలతో వచ్చే లవ్ ట్రాక్ యూత్‌కు నచ్చేలా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. పాటలు స్క్రీన్ మీద చూస్తే బాగానే అనిపిస్తాయి. ముఖ్యంగా ఒక మాస్ సాంగ్‌లో పవన్ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తాయి.
ఇంటర్వెల్ సీన్ దగ్గర సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది. హీరో, విలన్ మధ్య సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచుతుంది.
సెకండ్ హాఫ్‌లో కథ కాస్త సీరియస్‌గా మారుతుంది. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగా పని చేశాయి. ఒక చిన్న పిల్లల సెంటిమెంట్ ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే “తొలిప్రేమ” రీమిక్స్ సాంగ్ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది.
క్లైమాక్స్ మాత్రం సాధారణంగా కాకుండా కాస్త కొత్తగా చూపించారు. అది పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా ఉంది.
Ammma thoduuuuuu 🥵🥵🥵🥵🥵 Chachipotharu ra endhi ra asaluuuu itla chusta anukoledhu ra kalyan niii …As a kalyan fan demanding Harish shankar as Permanent director and thaman anna as Music director for all his moviesssss #UstaadBhagatSingh kalyan love you love you❤️❤️❤️ pic.twitter.com/w82G4sIahC
— Kalyan (@KalyanRamcharan) March 18, 2026
నటీనటుల పనితీరు
ఈ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మీదే నడుస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఆయన ఎనర్జీ తగ్గకుండా కనిపిస్తాడు. పోలీస్ పాత్రలో ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ బాగా ఉన్నాయి. “గబ్బర్ సింగ్” టైమ్ లో చూసిన పవన్ మళ్లీ కనిపించినట్టు ఉంటుంది.
శ్రీలీల తన పాత్రలో బాగా చేసింది. డ్యాన్స్, గ్లామర్ తో ఆకట్టుకుంది. రాశీ ఖన్నా చిన్న పాత్రలో కనిపించినా ఓకే అనిపిస్తుంది. విలన్ గా పార్థీబన్ నటన చాలా బాగుంది. అతని స్టైల్ కొత్తగా అనిపిస్తుంది.
టెక్నికల్ విషయాలు
దర్శకుడు హరీష్ శంకర్ పవన్‌ను ఎలా చూపించాలో బాగా తెలుసు. కథ కొత్తగా లేకపోయినా, తన స్టైల్‌లో సినిమాను ఆసక్తిగా తీశాడు. డైలాగ్స్, ఎలివేషన్స్ బాగున్నాయి.
దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు వినడానికి ఒకే గా ఉన్నా, స్క్రీన్ మీద బాగానే కనిపిస్తాయి. థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో బీజీఎం హైలైట్.
సినిమాటోగ్రఫీ కూడా రిచ్‌గా ఉంది. యాక్షన్ సీన్స్, లొకేషన్స్ బాగా చూపించారు. ప్రొడక్షన్ విల్యూస్ గ్రాండ్‌గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్
- మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్
- ఇంటర్వెల్, క్లైమాక్స్
- థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
- ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
- కథ రొటీన్ గా అనిపించడం
- పాటలు మరింత బెటర్ గా ఉండాల్సింది
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ నెమ్మదిగా అనిపించడం
ఫైనల్‌గా
“ఉస్తాద్ భగత్ సింగ్” ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమా. కథ కొత్తగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్ వల్ల సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి సినిమా. పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
Follow Us