తొక్క తీస్తాం..కొండాసురేఖ ఎపిసోడ్లో టాలీవుడ్ పెద్దల రియాక్షన్ ఇదే! తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటి సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆరే అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు సైతం సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. By Archana 03 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update samantha షేర్ చేయండి 1/6 సమంత విషయంపై హీరోల ఆగ్రహం సమంత పట్ల కొండా సురేఖ వ్యాఖ్యల పై మెగాస్టార్ స్పందిస్తూ.. "గౌరవనీయులైన మంత్రి సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యలకు నేను చాలా బాధపడ్డాను. వారి రీచ్ కోసం సెలెబ్రెటీలు, సినిమా వ్యక్తులను వాడుకోవడం సిగ్గుచేటైన విషయం. సంబంధం లేని వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను తమ రాజకీయాల్లోకి లాగడం.. అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే స్థాయికి ఎవరూ దిగజారకూడదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2/6 ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. వ్యక్తిగత జీవితాలను బయట పెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. పదవిలో ఉన్న మీలాంటి వారు హుందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించాలి. నిజంగా ఇది బాధాకరమైన సంఘటన. సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే.. చూస్తూ కూర్చునేది లేదని ఎన్టీఆర్ మండిపడ్డారు. 3/6 నాని "బాధ్యత గల పదవిలో ఉన్న రాజకీయ నాయకులు.. కాస్త బాధ్యతైనా లేకుండా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే.. ప్రజల పై మీకు బాధ్యత ఉందా..? లేదా..? అనిపిస్తోంది అని నాని సీరీయస్ అయ్యారు. ఇక్కడ నటీనటులు, చిత్రపరిశ్రమ, రాజకీయ పార్టీ అనేది కాదు.. ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా.. ఇలాంటి బేస్ లెస్ కామెంట్స్ చేయడం ఆమోదయోగ్యం కాదు" అంటూ ట్వీట్ చేశారు. 4/6 RGV సంచలన దర్శకుడు ఆర్జీవీ కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. "మంత్రి సురేఖ తన ప్రత్యర్థి పై పగ తీర్చుకోవడానికి నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడదు" అని ట్వీట్ చేశారు. 5/6 సుదీర్ బాబు మంత్రి కొండా సురేఖ నీచమైన, స్త్రీ ద్వేషితపూరిత వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను.. రాజకీయ పావులుగా వాడుకోవడం మీ నిరాశను తెలియజేస్తుంది అంటూ సుదీర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6/6 వెంకటేష్ ' బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారే వ్యక్తిగత విషయాలను రాజకీయ లబ్ది కోసం మార్చడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అలా చేసిన వారికి అది బాధను మాత్రమే మిగులుస్తుంది" అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి