/rtv/media/media_files/2026/05/24/ansiba-hassan-2026-05-24-16-31-07.jpg)
మలయాళ నటి, దృశ్యం 3 సినిమా ఫేమ్ అన్సిబా హసన్ తన తోటి నటుడు టినీ టామ్, అలాగే అమ్మ (మలయాళ సినీ నటీనటుల సంఘం)కు చెందిన కొందరు సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారు తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేశారని, మతం పేరుతో వేధించి సంఘం నుంచి బలవంతంగా రాజీనామా చేయించారని ఆమె వాపోయారు.
టినీ టామ్ తనను జిహాదీ అని అన్నారని, ఆమె మతాలు మారుస్తోందంటూ తన పర్సనల్ లైఫ్ గురించి తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌కు చెందిన ఒకరు తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. తాను ముస్లిం అయినందుకే ఇలా టార్గెట్ చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ తప్పుడు ప్రచారాల వల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, కానీ దీనిపై కోర్టుల చుట్టూ తిరగడం తనకు ఇష్టం లేదని చెప్పారు.
తనకున్న పనుల వల్ల, ఒత్తిడి వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఫిబ్రవరి 21న పైకి లేఖ ఇచ్చినా.. అసలు కారణాలను సంఘం సెక్రటరీకి ముందే చెప్పానని అన్సిబా అన్నారు. పైగా అసోసియేషన్‌లో ఉన్న ఒక మహిళా మెంబర్ తనపై పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారని, ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ కానీ, మిగతా పెద్దలు కానీ తనకు అండగా నిలబడలేదని ఆమె బాధపడ్డారు. కాగా, అన్సిబా ఈ సంఘంలో జాయింట్ సెక్రటరీగా ఉండేవారు.
అందులో నిజం లేదు
ఈ ఆరోపణలపై నటుడు టినీ టామ్ స్పందిస్తూ.. ఎవరో ఏదో చెబితే విని అన్సిబా తనపై నిందలు వేస్తోందని, అందులో నిజం లేదని అన్నారు. తాను ఎప్పుడూ నిజాయితీగా, ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు. దీనిపై అసోసియేషన్ కమిటీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. నటి ప్రియాంక కూడా టినీ టామ్‌కు సపోర్ట్ చేస్తూ.. అన్సిబాకు ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ లోపల మాట్లాడుకోవాల్సింది అని అన్నారు.
Follow Us