/rtv/media/media_files/2026/03/27/maruthi-harish-shankar-2026-03-27-16-50-45.jpg)
Maruthi - Harish Shankar
Maruthi - Harish Shankar: ఈ సంవత్సరం ఇద్దరు దర్శకులు చెప్పిన మాటలకు, తర్వాత వారి సినిమాలకు వచ్చిన ఫలితాలకు మధ్య పెద్ద తేడా కనిపించింది. అవే మారుతి ‘ది రాజా సాబ్’ సినిమా, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ముందే పెద్ద పెద్ద అంచనాలు పెంచారు. వింటేజ్ స్టైల్‌లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ను చూపిస్తామని చెప్పారు.
కానీ సినిమాలు రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇద్దరి సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ‘ది రాజా సాబ్’ ప్రభాస్ కెరీర్‌లోనే పెద్ద ఫ్లాప్‌గా మారింది. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా పవన్ కళ్యాణ్‌కు భారీ నిరాశ కలిగించింది.
ఈ పరిస్థితిలో మారుతి మాత్రం ప్రేక్షకుల రెస్పాన్స్ ను అంగీకరించి సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం వేరేలా స్పందించాడు. సినిమా కలెక్షన్స్ కూడా తక్కువగా వచ్చినప్పటికీ, తన సినిమా చాలా బాగుందని, ఇది తన బెస్ట్ వర్క్ అని చెబుతూ కొనసాగుతున్నాడు.
ఇండస్ట్రీలో చాలా మంది ఈ విషయం గమనించారు. మారుతి వాస్తవాన్ని అంగీకరించగా, హరీష్ శంకర్ మాత్రం విమర్శలను పట్టించుకోకుండా తన అభిప్రాయాన్ని మార్చుకోవడం లేదు అని అంటున్నారు.
ఈ ధోరణి భవిష్యత్తులో హరీష్ శంకర్ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిర్మాతలు, హీరోలతో వచ్చే అవకాశాలపై కూడా ఇది ప్రభావం చూపవచ్చు అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
Follow Us