/rtv/media/media_files/2025/11/21/the-great-pre-wedding-show-2025-11-21-18-58-40.jpg)
The Great Pre-Wedding Show
The Great Pre-Wedding Show: ఇటీవల విడుదలైన తెలుగు కామెడీ హిట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ నవంబర్ 7, 2025న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో థ్రివీర్, టీనా శ్రావ్య ముఖ్య పాత్రలు పోషించారు. హాస్యభరితమైన స్లైస్ ఆఫ్ లైఫ్ కథకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు OTT రీలీజ్ కూడా ఖరారైంది. ZEE5 ప్లాట్‌ఫారమ్ ద్వారా డిసెంబర్ 5, 2025 నుండి సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. థ్రివీర్, టీనా శ్రావ్య నటనకు OTTలో కూడా మంచి స్పందన వస్తుందని మూవీ టీం ఆశిస్తున్నారు.
కథ చిన్న గ్రామ ఫోటోగ్రాఫర్ రమేష్ చుట్టూ తిరుగుతుంది. ఆయన అసిస్టెంట్ ఒక ముఖ్యమైన మేమరీ కార్డ్ పోగొట్టడంతో సమస్యలు మొదలవుతాయి. ఇది ఒక రాజకీయ నాయకుడి ప్రీ-వెడ్డింగ్ వీడియో. భయంతో, రమేష్ ఒక్కొక అబద్ధం చెప్పి సమస్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు, దీనితో అనుకోని సంఘటనలు, మంచి కామెడీ జరుగుతోంది.
థ్రివీర్ మాట్లాడుతూ, “రమేష్ పాత్రలో ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి జీవితం లోకి అడుగుపెట్టినట్టే అనిపించింది. అతని భయం, ఇనోసెన్స్, తప్పును సరిచేసే ప్రయత్నాలు కామెడీగా ఉంటాయి, ప్రతి సీన్ నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది” అని తెలిపారు. టీనా శ్రావ్య, “సినిమా సింపుల్ గా, నిజమైన పాత్రలతో చాలా బాగుంటుంది . ప్రతి సీన్ సహజంగా, కామెడీగా అనిపించింది.” అని అన్నారు.
సినిమా అమెరికాలో 100,000 డాలర్ల వసూళ్లు సాధించడంతో టీమ్ ఆనందంలో ఉన్నారు. "మంచి కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. నిర్మాతలైన సందీప్ అగరమ్, ఆశ్మిత రెడ్డి బసాని గార్లకు కథను నమ్మినందుకు ధన్యవాదాలు” అని థ్రివీర్ పేర్కొన్నారు.
Follow Us