/rtv/media/media_files/2025/03/18/ZjfAySFDK5skrdryIg68.jpg)
Tamannaah Odela 2
Tamannaah Odela 2: ఈ రోజుల్లో ఓటీటీ(OTT)కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రేక్షకులు తెగ చూస్తున్నారు. థియేటర్ లో ప్లాప్ అయ్యి ఓటీటీకి వచ్చాక హిట్ అయిన మూవీస్ లిస్ట్ చాలానే ఉన్నాయి. కానీ రాను రాను సినిమాలకు మాత్రం ఓటీటీ డీల్ సెట్ అవ్వడం చాలా కష్టంగా మారుతోంది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాయి.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
పెరుగుతున్న ఓటీటీ డిమాండ్ దృష్ట్యా ఓటీటీ సంస్థలు ఒక సినిమాని కొనాలి అంటే ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. సినిమాను ముందుగానే చూసి ఎంతో బాగుంటే తప్పా డీల్ కుదుర్చుకోవడం లేదు. ఓటీటీ కోసం భారీ ధరలు డిమాండ్ చేయడంతో, సినిమాను కొనడానికి అంత తేలిగ్గా ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదు. అదే ఇప్పుడు నిర్మాతలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
ఇలాంటి పరిస్థితి ఇప్పుడు తమ్మన్నా కొత్త మూవీ ‘ఓదెల 2'కు ఎదురైంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంపత్ నంది నిర్మించారు. ‘ఓదెల రైల్వే స్టేషన్’ గతంలో ఓటీటీలో పెద్ద హిట్ కావడంతో, ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ‘ఓదెల 2’ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు మారారు. అలాగే, ఈసారి సినిమా స్థాయి కూడా పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
అమేజాన్ రూ.12 కోట్లు ఓటీటీ డీల్..
ఇటీవల ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది. అమేజాన్ సంస్థ ఈ చిత్రానికి రూ.12 కోట్లు ఇచ్చి ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది. అతి కష్టంగా ఇంత భారీ ధరకు ఓటీటీ డీల్ సెట్ అయిందట, హిందీ డబ్బింగ్ హక్కులు రూ.6.25 కోట్లకు అమ్ముడయ్యాయి. శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడైనట్లే. ఈ సినిమాని నిర్మాత మొత్తం బడ్జెట్ రూ.20 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఈ మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే కనిపిస్తోంది. ఇక థియేటర్ నుండి వచ్చే ఆదాయం అంతా లాభమే.
‘ఓదెల 2’ షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయ్యింది, ఏప్రిల్‌లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ నెల ఆఖరిలో ప్రొమోషన్లను స్టార్ట్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఎలాగైనా ఈసారి 'ఓదెల 2’తో తెలుగులో సూపర్ హిట్ కొట్టాలన్నది తమన్నా టార్గెట్.