/rtv/media/media_files/2026/02/06/taapsee-assi-trailer-2026-02-06-12-45-09.jpg)
Taapsee Assi Trailer
Taapsee Assi Trailer: ఇన్వెస్టిగేటివ్ కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంతో రూపొందిన చిత్రం ‘అస్సీ’. ఈ సినిమాలో తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 20, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని బాగా పెంచింది. ట్రైలర్‌లో తాప్సి ఓ పవర్ ఫుల్ న్యాయవాదిగా కనిపించారు. అత్యాచార కేసును ఎదుర్కొంటూ, వ్యవస్థలోని లోపాలు, అన్యాయాలపై ప్రశ్నలు వేస్తూ ఆమె చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారి కేసును ప్రస్తావిస్తూ ఆమె అడిగిన ప్రశ్నలు బాగున్నాయి.
ఈ సినిమాలో తాప్సి రావి అనే లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఒక అత్యాచార కేసులో న్యాయం సాధించేందుకు పోరాడుతుంది. ఈ కథ మొత్తం న్యాయవ్యవస్థ, సమాజంలోని సమస్యల చుట్టూ తిరుగుతుంది.
ముఖ్య పాత్రలు, నటీనటులు
ఈ చిత్రంలో రేవతి న్యాయమూర్తి పాత్రలో కనిపించనున్నారు. న్యాయం కోసం కఠినంగా నిలబడే పాత్రగా ఆమె నటన ఉండనుంది. మనోజ్ పహ్వా నిందితుడి తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. సంపన్న కుటుంబానికి చెందిన తండ్రి పాత్రను ఆయన సహజంగా చూపించారు.
సుప్రియా పాఠక్ నిందితుడి తల్లి పాత్రలో నటించగా, నసీరుద్దీన్ షా ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర చిన్నదైనా బలంగా ఉండనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పరిమా. ఈ పాత్రను కని కుస్రుతి పోషించారు. అత్యాచారానికి గురైన మహిళగా ఆమె నటన ట్రైలర్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె భర్త వినయ్ పాత్రలో మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్ నటించారు. భార్యకు అండగా నిలిచే భర్తగా ఆయన పాత్ర ఉంది. వారి కుమారుడిగా అద్విక్ జైస్వాల్ నటిస్తూ సమాజంలోని నిజాలను ప్రశ్నించే పాత్రలో కనిపించారు.
నిందితుడి తరఫు న్యాయవాదిగా సత్యజిత్ శర్మ నటిస్తున్నారు. తాప్సితో జరిగే కోర్ట్ వాదనలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పోలీస్ అధికారుల పాత్రల్లో రాజేంద్ర సేథీ, జతిన్ గోస్వామి నటిస్తూ కేసు నిజాలు వెలికితీయడం చూపిస్తారు.
ట్రైలర్ చూసిన తర్వాత ‘అస్సీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కని కుస్రుతి నటన ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Follow Us