/rtv/media/media_files/2026/05/28/surya-2026-05-28-12-07-32.jpg)
Surya
Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘వీరభద్రుడు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఈ సినిమా సూర్యకు పెద్ద ఊరట అనే చెపొచ్చు. ఇందులో ఆయన పూర్తిస్థాయి హీరో కాకపోయినా, కీలకమైన ఎక్స్‌టెండెడ్ క్యామియో పాత్రలో కనిపించాడు.
మొదట్లో ఈ సినిమా సూర్య ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా అని ప్రచారం జరిగింది. కొన్ని సీన్లు బాగా వర్కౌట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ విజయానికి సూర్యకే ఎక్కువ క్రెడిట్ దక్కింది. అభిమానులు కూడా ఈ సక్సెస్‌తో సంతోషంగా ఉన్నారు.
ఈ విజయంతో సూర్య ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తన 47వ సినిమాను షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మలయాళంలో ‘ఆవేశం’ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక సూర్య తన 48వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘జై భీమ్’ వంటి సూపర్ హిట్ సినిమాను రూపొందించిన టీజే జ్ఞానవేల్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇటీవల ఆయన చెప్పిన కథ సూర్యకు చాలా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమా సూర్య ‘జగరం స్టూడియోస్’ బ్యానర్‌లో రూపొందనుంది.
ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. 2027 సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా వేగంగా షూటింగ్ జరగనుంది.
అదే సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
మొత్తం మీద సూర్య ఇప్పుడు వరుసగా కొత్త సినిమాలతో బిజీగా ఉండగా, అభిమానుల్లో కూడా ఈ సినిమాలపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
Follow Us