/rtv/media/media_files/2026/05/05/surya-karuppu-2026-05-05-09-08-03.jpg)
Surya Karuppu
Surya Karuppu: సూర్య Suriya హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కరుప్పు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శకుడు RJ Balaji తెరకెక్కించిన ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది. దీంతో ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కానుంది.
ఈ సినిమాలో సూర్య ‘సరవణన్’ అనే లాయర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. చట్టం ద్వారా న్యాయం చేయలేని పరిస్థితుల్లో, అతనిలో కరుప్పస్వామి దేవుడు ఆవహించి న్యాయం చేస్తాడనే కథతో సినిమా సాగుతుంది. యాక్షన్, ఎమోషన్, డ్యాన్స్ కలిపి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ Trisha Krishnan నటిస్తోంది. ‘ఆరు’ సినిమా తర్వాత దాదాపు 20 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో యోగి బాబు Yogi Babu, ఇంద్రన్స్ Indrans, శివదా Sshivada, స్వాసిక Swasika, నట్టి Natty, సుప్రీత్ రెడ్డి Supreeth Reddy, అనఘ మాయ రవి Anagha Maya Ravi కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాను ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. సెన్సార్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.
ఇక మరోవైపు, తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు చాలా కాలంగా నిలిపివేశారు. పెద్ద హీరోల సినిమాలు కూడా ఉదయం 9 గంటల తర్వాతే ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు విజయ్ Vijay నాయకత్వంలోని పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో, అభిమానులు మళ్లీ ఎర్లీ షోలు ప్రారంభించాలని కోరుతున్నారు.
‘కరుప్పు’ సినిమా ఎన్నికల తర్వాత విడుదలయ్యే పెద్ద చిత్రం కావడంతో, సూర్య అభిమానులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. సినిమా రంగం అభివృద్ధికి ఆయన సహకరిస్తారని అభిమానులు నమ్ముతున్నారు.
Follow Us