ఎమోషనల్ గా 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్ 'మా నాన్న సూపర్ హీరో' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అంతా ఎమోషనల్ గా సాగింది. కంటే తండ్రై పోవు, తనతో ఉండాలి, సరిగా పెంచాలి, నాకోసం చేస్తే తప్పు.. ఇది నాన్న కోసం అనే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 11 న ఈ మూవీ రిలీజ్ కానుంది. By Anil Kumar 05 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లో సుదీర్ బాబు ఒకరు. రీసెంట్ గా 'హరోం హర' మూవీతో యాక్షన్ హీరోగా అదరగొట్టిన ఈయన.. ఈసారి ఓ ఎమోషనల్ మూవీతో రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. లూజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతున్నఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. Buckle up for a heartwarming tale that celebrates the SUPERHERO called 'Nanna' ❤️#MNSHTrailer Out Now ❤️🔥🔗 https://t.co/T0d159vkw7Thank you 𝐒𝐔𝐏𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @urstrulyMahesh Garu for launching the #MNSHTrailer ✨#MaaNannaSuperhero in cinemas from October 11th 💫🌟ing… pic.twitter.com/vJiPnJZnaX — UV Creations (@UV_Creations) October 5, 2024 ఎమోషనల్ గా సాగిన ట్రైలర్.. ఇక ట్రైలర్ అంతా ఎమోషనల్ సీన్స్ తో సాగింది. డబ్బు కోసం పుట్టగానే తన కొడుకుని(సుధీర్ బాబు) అమ్ముకుంటాడు సాయి చంద్. జన్మ ఇవ్వలేకపోయిన తన కొడుకుగా పెంచుకుంటాడు షాయాజీ షిండే. అయితే తన కొడుకు కోసం 25 ఏండ్ల తర్వాత వచ్చిన తండ్రి దగ్గరికి సుధీర్ బాబు వెళతాడా? లేదా పెంచిన తండ్రి దగ్గర ఉంటాడా? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ లో క్లియర్ గా చెప్పేశారు. Also Read : ఆ హీరోకైతే విలన్ గా చేయడానికి నేను రెడీ : గోపీచంద్ ప్రేమతో చేసినంత మాత్రాన తప్పు తప్పుకాకుండా పోదు, కంటే తండ్రై పోవు, తనతో ఉండాలి, సరిగా పెంచాలి, నాకోసం చేస్తే తప్పు.. ఇది నాన్న కోసం తప్పదు.. అనే ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సాయిచంద్, సాయాజీ షిండే ఇద్దరూ తండ్రి పాత్రల్లో నటించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) #sudheer-babu #maa-nanna-superhero మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి