అత్యధిక వసూళ్ళ చిత్రాల్లో శ్రద్ధా ‘స్త్రీ-2’.. ఎన్ని కోట్లో తెలుసా! నటి శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ-2’ తన కెరీర్‌కి ఊహించని వరమని తెలిపింది. బాలీవుడ్ లో ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యమని సంతోషం వ్యక్తం చేసింది. By Archana 24 Sep 2024 in సినిమా Short News New Update Shraddha Kapoor షేర్ చేయండి 1/9 శ్రద్ధా కపూర్, కుమార్ రావు లీడ్ రోల్స్ నటించిన సూపర్ హిట్ కామెడీ హర్రర్ 'స్త్రీ2'. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నెల రోజులు దాటినా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'స్త్రీ2' హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. 39 రోజుల్లోనే రూ. 604కోట్ల షేర్, రూ. 713కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 2/9 తాజాగా నటి శ్రద్ధా 'స్త్రీ2' విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'స్త్రీ2' తన కెరీర్ కి ఊహించని వరమని. ఈ స్థాయి విజయాన్ని తనెప్పుడూ ఊహించలేదని తెలిపింది. ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 3/9 పెద్ద స్టార్లు లేకపోయినా కథ సరిగ్గా చెబితే జనం ఆదరిస్తారని మరో సారి రుజువైంది అని శ్రద్దా ఆనందం వెలిబుచ్చింది. 'స్త్రీ 3' కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. 4/9 ప్రస్తుతం స్త్రీ2 దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆరో స్థానంలో ఉంది. 5/9 స్త్రీ 2 తొలిరోజే రూ. 58.20 కోట్ల వసూళ్లతో ఫైటర్, కల్కి వంటి భారీ చిత్రాల ఫస్ట్ డే రికార్డులను బ్రేక్ చేసింది. 6/9 అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 7/9 గతేడాది శ్రద్దా రణ్ బీర్ కపూర్ సరసన 'తు జూత్ మెయిన్ మక్కార్' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదే జోష్ తో ఈ ఏడాది 'స్త్రీ2' తో మరో హిట్ కొట్టింది. 8/9 శ్రద్ధా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'సాహూ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 9/9 Image Credits: Shraddha Kapoor/ Instagram #stree-2 #bollywood-actress #shraddha-kapoor సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి