దుమ్మురేపుతున్న శివజ్యోతి 'నగాదారిలో' బతుకమ్మ సాంగ్.. చూశారా? దసరా పండగ వచ్చిందంటే బతుకమ్మ పాటల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది యాంకర్ శివజ్యోతి బతుకమ్మ పై చేసిన 'నగాదారిలో' సాంగ్ నెట్టింట దుమ్మురేపుతోంది. ఒక్కరోజులోనే లక్షల వ్యూస్ సాధించింది. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 03 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Jyothakka bathukamma song షేర్ చేయండి Bathukamma 2024: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆడపిల్లలకు ఈ పండగతో మరింత అనుబంధం ఉంటుంది. బతుకమ్మ వేడుకల్లో అమ్మాయిలు అందంగా ముస్తాబవడంతో పాటు.. గౌరమ్మను రకరకాల పూలతో తయారుచేసి ఆటపాటలతో సందడి చేస్తారు. మొత్తం 9 రోజుల పాటు చేసుకునే ఈ వేడుకల్లో గౌరమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. Also Read : టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! మొదటి రోజు: ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు: అటుకుల బతుకమ్మ, మూడవ రోజు: ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు, నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు: అట్ల బతుకమ్మ, ఆరవ రోజు: అలిగిన బతుకమ్మ , ఏడవ రోజు: వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు: వెన్నెల ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు: సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మను తొమ్మిది పేర్లతో పూజిస్తారు. ఇక పూజలతో పాటు బతుకమ్మ వచ్చిందంటే బతుకమ్మ పాటల సందడి కూడా మొదలవుతుంది. ఇప్పటికే బతుకమ్మ పై ఎన్నో పాటలు వచ్చాయి.. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. ఇక ఈ ఏడాది కూడా పై అనేక పాటలు రిలీజ్ అయ్యాయి. Also Read: తొక్క తీస్తాం..కొండాసురేఖ ఎపిసోడ్‌లో టాలీవుడ్ పెద్దల రియాక్షన్ ఇదే! దుమ్మురేపుతున్న శివజ్యోతి 'నగాదారిలో' సాంగ్ ఈ ఏడాది వచ్చిన బతుకమ్మ పాటల్లో శివజ్యోతి 'నగాదారిలో' సాంగ్ నెట్టింట దుమ్మురేపుతోంది. ఈ పాటలోని లిరిక్స్, విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు రోజుల్లోనే ఈ సాంగ్ 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటను శివజ్యోతి స్వయంగా ప్రొడ్యూస్ చేయడంతో పాటు యాక్ట్ చేశారు. 'ఓ పిల్లగా ఎంకటేష్' సాంగ్ ఫేమ్ వాణి వొల్లాల, ప్రభ ఈ పాటను పాడారు. సినిమాల్లో కంటే ప్రైవేట్ ఆల్బమ్స్ రూపంలోనే బతుకమ్మ సాంగ్స్ కి భారీ ప్రేక్షకాదరణ దక్కడం విశేషం. Also Read: Triptii Dimri: దయచేసి ఈ పుకార్లు ఆపండి.. నేను అలా చేయలేదు..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి